
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
KTR vs Revanth Reddy: మహబూబ్‌నగర్ ప్రజలు కాంగ్రెస్‌ను, రేవంత్ రెడ్డిని తరిమికొడతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. పాలమూరు ప్రాజెక్టును పక్కనపెట్టి ద్రోహం చేస్తున్నారని.. కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
కేటీఆర్ దిశానిర్దేశం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలతో క్షేత్ర స్థాయి పరిస్థితులపై మాజీ మంత్రి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ ప్రస్తుతం కొనసాగిస్తున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాల తీరును సమీక్షించారు.
త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నియోజకవర్గాల వారీగా చర్చించారు. అనంతరం కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాలమూరు ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్తారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
పథకాన్ని పక్కనపెట్టి కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటకు నీరందకుండా రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం ప్రతి ఒక్కరికీ అర్థమైంది. మహబూబ్‌నగర్ బిడ్డను అని పదేపదే చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తూ అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డిని కొడంగల్ నుంచి తరిమికొడతారు' అని మాజీ మంత్రి కేటీఆర్ జోష్యం చెప్పారు. గతంలో మాదిరి మరోసారి కొడంగల్ నియోజకవర్గంలోనూ రేవంత్ రెడ్డికి ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని తెలిపారు. జిల్లా ప్రజలకు చేయాల్సిన అభివృద్ధిని.. పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను పక్కనపెట్టి కేవలం రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కేటీఆర్ జోష్యం చెప్పారు.
పాలమూరు అన్ని రంగాల్లో అగ్రస్థానం తెలంగాణ ఏర్పాటుకు ముందు వలసల జిల్లాగా, కరువు జిల్లాగా ఉన్న పాలమూరును అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి కరువును, వలసలను తరిమికొట్టిన ఘనత ముమ్మాటికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అర్థమవుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకువెళ్తూనే.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మనం చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు గుర్తుచేయాలని కేటీఆర్ సూచించారు. పాలమూరు జిల్లాకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపాలని దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి భారీగా ఆదరణ క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రతి ఒక్కరూ గుర్తించారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నాయకులకు కేటీఆర్ ఆదేశించారు.
కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని మహబూబ్‌నగర్ ప్రజలు జిల్లా నుంచి తరిమికొడతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డిని కొడంగల్ నుంచి తరిమికొడతారు 'పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల