
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Cm Revanth reddy review on Heavy rains amid monsoon season: తెలంగాణ వ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ గా చెప్పుకునే గ్రేటర్ హైదరాబాద్ తొలకరి వర్షానికే చిగురుటాకుల వణికిపోయింది.
ఈనేపథ్యంలో ఎక్కడికక్కడ రోడ్ల మీద వరద నీళ్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ కు చాలా అంతరాయం ఏర్పడింది. వరద నీళ్లలో కారులు, బైక్ లు కొట్టుకునిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్దిసేపు పడిన వర్షానికే నగర జీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది.
ఈ క్రమంలో వర్షాలపై తీసుకొవాల్సిన జాగ్రత్తలపై అన్నిశాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అంతే కాకుండా వర్షాలపై తాను ముందస్తుగాచెప్పిన ప్రణాళికల్ని అధికారులు పాటించలేదని వారిపై సీరియస్ అయ్యారు. జూన్ 1 న రివ్యూ పెట్టి వర్షాల పైన ముందస్తు సూచనలు ఇచ్చిన అధికారులు పాటించడంలో విఫలమయ్యారని అన్నారు.
కనీసం జూన్ 9 న వర్షం సమయం లో అధికారులు సరిగా పని చేయలేదన్నారు. వర్షాల సమయం లో క్యూర్ ఏరియా లో మునిసిపల్ , పోలీస్, ఇతర శాఖలకు చెందిన అధికారుల మధ్య సమన్వయం లొపించిందని పేర్కొన్నారు. దీనిపైన అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
వర్షం వచ్చినప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్, బ్లాక్ స్పాట్స్, ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రాంతాల డేటా ఆధారం గా పని చేయాలన్నారు. విద్యుత్ శాఖ పూర్తి స్థాయి లో సన్నద్ధం కావాలని, ఫీల్డ్ లో ఉండని అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.
సమయం లో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు రోడ్ల పైన ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి తెల్చిచెప్పారు. అవసరం అయితే నేను కూడా రోడ్ పైకి వస్తానని చెప్పారు. వానల వల్ల ఎక్కడైన ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇక మానవ తప్పిదాల వల్ల సమస్యలు వస్తే అస్సలు సహించేది లేదని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో తక్షణమే ఖాళీ లు పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు.
వర్షాల నేపథ్యంలో ప్రాజెక్ట్ ల దగ్గర పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రాజెక్ట్ ల మెయింటెన్స్ మాన్యువల్ ప్రకారం జరగాలన్నారు. ప్రాజెక్ట్ సంబంధిత ఇంజనీర్లు కచ్చితం గా మాన్యువల్ ను అమలు చేయాలన్నారు. ప్రాజెక్ట్ ల సీఈ లు , ఎస్ సీ లు ఈ సీజన్ లో స్థానికం గా ఉండాల్సిందేనని హుకుం జారీచేశారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఇంజినీర్లు ప్రాజెక్ట్ లు వదిలి వస్తే కఠిన చర్యలుతప్పవని హెచ్చరించారు.
ప్రాజెక్టుల మెయింటెన్స్, గేట్ల మరమ్మత్తులకు తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు. ఇరిగేషన్, మెట్రో వాటర్ బోర్డు, RWS అధికారులు సమన్వయం తో పని చేయాలన్నారు. రైతు వేదిక లను యూరియా పంపిణీ కోసం ఉపయోగించుకోవాలన్నారు.
Read more: BRS KTR: సీఎం రేవంత్ రెడ్డి ఫస్టాఫ్ పాలన అట్టర్ ఫ్లాప్.. కాంగ్రెస్‌పై మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్.. ఏమన్నారంటే..?
రైతు వేదిక లో యూరియా పంపిణీ బాధ్యతను స్థానిక అగ్రికల్చర్ అధికారికి అప్పగించాలని సూచించారు. యూరియా పంపిణీ లో రెవిన్యూ సిబ్బంది ని భాగస్వామ్యం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖలకు చెందిన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
వర్షం