
Narendra Modi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఒక అరుదైన దౌత్య ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదివారం ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఉన్న చారిత్రక కట్టడం ‘విల్లా కెర్లియోస్’ను ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల అగ్రనేతలు ఎంతో ఆత్మీయ వాతావరణంలో, తేలికపాటి సంభాషణలు సాగిస్తూ ఆ భవన ప్రాంగణమంతా కలియతిరిగారు. ఇరు నేతల మధ్య ఉన్న సుదృఢ బంధానికి ఈ పర్యటన అద్దం పట్టింది. read also: Gurbhej Singh: లండన్ లో భారత సంతతి యువకుడు దారుణ హత్య 20వ శతాబ్దపు ఆరంభంలో నిర్మితమైన ‘విల్లా కెర్లియోస్’ ప్రపంచ ప్రసిద్ధ హౌస్ మ్యూజియంగా గుర్తింపు పొందింది.
క్రీస్తుపూర్వం 2వ శతాబ్ద కాలం నాటి ఒక పురాతన గ్రీకు ఉన్నత వర్గాల నివాస శైలిని ఆధారంగా చేసుకుని, ఎంతో అద్భుతంగా ఈ భవనాన్ని పునఃసృష్టించారు. ఫ్రెంచ్ రివేరా తీరప్రాంతంలో, నైస్ – మొనాకో నగరాల మధ్యన ఉన్న ‘బ్యూలీ-సర్-మెర్’ అనే సుందరమైన ప్రదేశంలో ఇది కొలువై ఉంది.
మధ్యధరా సముద్ర తీరాన ఒక రాతి ద్వీపకల్పంపై ఉండే ఈ అపురూప కట్టడం ప్రస్తుతం జాతీయ వారసత్వ సంపదగా వర్గీకరించబడింది. దీని నిర్వహణ బాధ్యతలను ‘ఇన్స్టిట్యూట్ డి ఫ్రాన్స్’ చూసుకుంటుంది. ఈ చారిత్రక విహారానికి ముందు, నీస్ నగరంలో ఏర్పాటు చేసిన ‘భారత్ ఇన్నోవేట్స్’ (India Innovates) సదస్సును మోదీ, మేక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ వేదికపై పీఎం మోదీ ప్రసంగిస్తూ.. భారతదేశంలో ఆర్థిక, సాంకేతిక రంగాల సంస్కరణల వేగం అస్సలు తగ్గబోదని స్పష్టం చేశారు. దేశంలో స్టార్టప్ ఇకోసిస్టమ్ మరింత వేగంగా విస్తరిస్తోందని అన్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ అద్భుతమైన ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించుకుందని గుర్తు చేశారు.
ప్రస్తుతం అంతర్జాతీయంగా మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా భారత్ నిలిచిందని గర్వంగా ప్రకటించారు. గ్లోబల్ సవాళ్లకు సరికొత్త సాంకేతిక పరిష్కారాలను కనుగొనడంలో
భాగస్వాములు కావాలంటూ ప్రపంచవ్యాప్త ఇన్వెస్టర్లను, ఆవిష్కర్తలను ప్రధాని ఈ సందర్భంగా ఆహ్వానించారు.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి భారత ప్రధాని హాజరుకావడం ఫ్రాన్స్ దేశానికి దక్కిన గొప్ప గౌరవంగా అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అభివర్ణించారు. భారత అగ్రనేతగా సుదీర్ఘ కాలం విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నందుకు మోదీకి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక, దౌత్య సంబంధాలను అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత శిఖరాలకు చేర్చడంలో ప్రధాని మోదీ పోషించిన పాత్రను మేక్రాన్ కొనియాడారు.
అధ్యక్షుడు మేక్రాన్ అధికారిక ఆహ్వానం మేరకు శనివారమే ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోదీ, ఈ పర్యటనలో భాగంగా పలువురు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులతో సమావేశమై భారతదేశంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.
PM Modi Meets French President : ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Gurbhej Singh: లండన్ లో భారత సంతతి యువకుడు దారుణ హత్య
Ayatollah Ali Khamenei: జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
G7 సదస్సులో మోదీ-ట్రంప్ సమావేశం..అధికారిక ప్రకటన చేసిన వైట్ హౌస్
Lyaki Freedom Ship Attack: ‘లియాకి ఫ్రీడమ్’ నౌకపై దాడి జరగలేదు.. విదేశాంగ శాఖ స్పష్టత
Indian passport and visa in UAE : యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్, వీసా సేవల్లో భారీ మార్పులు!
Iran Rejects Trump Allegation : అమెరికా దాడిలోనే భారతీయులు మృతి..ఇరాన్ సంచలన ప్రకటన