
Cockroach Janata Party At Hyderabad: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' నేడు తెలంగాణలోని హైదరాబాద్లో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు విద్యావ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త, ఉద్యమ నేత సోనమ్ వాంగ్చుక్తో పాటు తదితరులు పాల్గొన్నారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఈ నిరసన హైదరాబాద్లో చేపట్టడంపై భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం తక్కువగా ఉన్న దక్షిణాదితో తమ పార్టీ పట్టు పెంచుకునేందుకు పక్కా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది
.