తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు మొటిమల వాపు, మంట తగ్గించడంలో సహాయపడతాయని డెర్మటాలజీ అధ్యయనాలు తెలుపుతున్నాయి. దీనికోసం నాణ్యమైన తేనెను నేరుగా మొటిమలకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. పసుపులోని యాంటీ సెప్టిక్ గుణాలు మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం కొద్దిగా పసుపులో తేనె లేదా పెరుగు కలిపి పేస్ట్ చేయండి. దీనిని మొటిమలకు రాసుకుని కాసేపయ్యాక శుభ్రం చేసుకుంటే చాలు. వేపాకుల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం వేపాకులను కడిగి పేస్ట్ చేయండి. దీనిని మొటిమలకు రాసుకుని 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. జిడ్డు ముఖంపై గల మొటిమలు తగ్గించడంలో ముల్తానీ మట్టి సహాయపడుతుంది. దీనికోసం ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోండి. ఆరిన తర్వాత క్లీన్ చేసుకుంటే చాలు. మొటిమల నొప్పి, వాపు తగ్గించడంలో అలోవెరా సహాయపడుతుంది. దీనికోసం తాజా అలోవెరా జెల్ తీసుకుని మొటిమలకు రాసుకోండి. 20 నిమిషాలు ఆగి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీనికోసం గ్రీన్ టీ తయారుచేసి చల్లారాక కాటన్ ప్యాడ్ సహాయంతో మొటిమలపై రాసుకోండి. 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోండి. లేదంటే తయారుచేసిన గ్రీన్ టీ బ్యాగ్ ఫ్రిజ్‌లో ఉంచి తర్వాత మొటిమలపై కాసేపు ఉంచుకోండి. మొటిమలు ఉబ్బడం, ఎర్రగా మారడం, నొప్పిని ఐస్ క్యూబ్ నివారిస్తుంది. దీనికోసం పల్చటి, శుభ్రమైన క్లాత్‌లో ఐస్ క్యూబ్ తీసుకుని మొటిమలు ఉన్నచోట కాసేపు ఉంచితే సరిపోతుంది. రోజుకు రెండుసార్లు చేస్తే మొటిమలు ఈజీగా తగ్గుతాయి. యాపిల్ సైడర్ వెనిగర్‌లోని ఎసిడిక్ గుణాలు చర్మం పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసి మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం మూడు భాగాల నీళ్లలో ఒక భాగం వెనిగర్ కలిపి దీనిని మొటిమలకు రాసుకోండి. 10 నిమిషాల తర్వాత
క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
టీ ట్రీ ఆయిల్‌లోని యాంటీ మైక్రోబియల్ గుణాలు మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికోసం కొబ్బరి నూనె లేదా జోజాబా నూనెలో కొద్దిగా టీ ట్రీ ఆయిల్ కలిపి మొటిమలు రాసుకోండి. కాసేపయ్యాక శుభ్రం చేసుకుంటే చాలు.