
ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-3లో సంచలనం నమోదైంది. పది సార్లు ఒలింపిక్స్ ఛాంపియన్లు అయిన సౌత్ కొరియాపై భారత్ వరుసగా రెండోసారి విజయం సాధించింది. టర్కీలోని ఆంటాల్యా వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఇవాళ (జూన్ 14) జరిగిన ఫైనల్లో భారత జోడీ (బొమ్మదేవర-కుమ్కుమ్ మోహోద్) కొరియా ద్వయం కిమ్ జే-డియోక్, ఓ యే జిన్ను 5-1 (37-36, 37-36, 39-39) తేడాతో ఓడించి, గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ మొత్తం భారత ఆటగాళ్లు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ప్రతి బాణాన్నీ అత్యంత కచ్చితత్వంతో సంధించారు. ముఖ్యంగా 17 ఏళ్ల కుమ్కుమ్ మోహోద్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. గత నెలలో జరిగిన షాంఘో వరల్డ్‌కప్‌లోనూ కుమ్కుమ్.. దీపికా కుమారి, అంకిత భకత్‌తో కలిసి సెమీస్‌లో కొరియాను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. తాజాగా అదే జోరు వరల్డ్‌కప్ స్టేజ్-3 టోర్నీలోనూ కొనసాగింది. ఈ గెలుపు ఆసియా క్రీడలకు ముందు భారత రికర్వ్ జట్టులో విశ్వాసాన్ని మరింత పెరిగింది. ధిరజ్ విషయానికొస్తే.. అతడికి ఇది తొలి వరల్డ్‌కప్ మిక్స్డ్ టీమ్ స్వర్ణం. గతంలో అతను కాంస్య పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ధిరజ్ వ్యక్తిగత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్నాడు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21) మూడు ముళ్ల బంధానికి పద్నాలుగేళ్లు..ముచ్చటగా ముగ్గురు పిల్లలు (ఫోటోలు) ఓరి నీ శ్రీనుగా.. ఒకసారి నా ముందుకు రా! నన్ను తిరుపతి నుంచి తరుముతావా?! పల్నాడులో పడవ బోల్తా.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు యాదాద్రి జిల్లాలో మిస్టరీ డెత్.. ఫామ్ హౌస్ లో యువకుడి డెడ్
Jun 14 2026 5:29 PM | Updated on Jun 14 2026 5:40 PM
ఆర్చరీ వరల్డ్‌కప్ స్టేజ్-3లో సంచలనం నమోదైంది. పది సార్లు ఒలింపిక్స్ ఛాంపియన్లు అయిన సౌత్ కొరియాపై భారత్ వరుసగా రెండోసారి విజయం సాధించింది. టర్కీలోని ఆంటాల్యా వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
ఇవాళ (జూన్ 14) జరిగిన ఫైనల్లో భారత జోడీ (బొమ్మదేవర-కుమ్కుమ్ మోహోద్) కొరియా ద్వయం కిమ్ జే-డియోక్, ఓ యే జిన్ను 5-1 (37-36, 37-36, 39-39) తేడాతో ఓడించి, గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకుంది.
మ్యాచ్ మొత్తం భారత ఆటగాళ్లు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ప్రతి బాణాన్నీ అత్యంత కచ్చితత్వంతో సంధించారు. ముఖ్యంగా 17 ఏళ్ల కుమ్కుమ్ మోహోద్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. గత నెలలో జరిగిన షాంఘో వరల్డ్‌కప్‌లోనూ కుమ్కుమ్.. దీపికా కుమారి, అంకిత భకత్‌తో కలిసి సెమీస్‌లో కొరియాను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. తాజాగా అదే జోరు వరల్డ్‌కప్ స్టేజ్-3 టోర్నీలోనూ కొనసాగింది. ఈ గెలుపు ఆసియా క్రీడలకు ముందు భారత రికర్వ్ జట్టులో విశ్వాసాన్ని మరింత పెరిగింది.
ధిరజ్ విషయానికొస్తే.. అతడికి ఇది తొలి వరల్డ్‌కప్ మిక్స్డ్ టీమ్ స్వర్ణం. గతంలో అతను కాంస్య పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ధిరజ్ వ్యక్తిగత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 16వ స్థానంలో ఉన్నాడు.
ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)
కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21)
మూడు ముళ్ల బంధానికి పద్నాలుగేళ్లు..ముచ్చటగా ముగ్గురు పిల్లలు (ఫోటోలు)
ఓరి నీ శ్రీనుగా.. ఒకసారి నా ముందుకు రా! నన్ను తిరుపతి నుంచి తరుముతావా?!
పల్నాడులో పడవ బోల్తా.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
యాదాద్రి జిల్లాలో మిస్టరీ డెత్.. ఫామ్ హౌస్ లో యువకుడి డెడ్ బాడీ
మెడకు GPS ట్రాకర్ వల్లే! కుక్క మరణంపై.. జాహ్నవి తల్లి భావోద్వేగం