
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల ఇంటెరాక్టివ్ సెషన్ లో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ తో భారత్ చర్చలు జరపాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. పాకిస్థాన్ లోని ప్రజల గురించి దత్తాత్రేయ హోసబాలే ఆలోచించారని క్లారిటీ ఇచ్చారు. పాకిస్థాన్ విషయంలో కేంద్ర పాలసీకి తాము కట్టుబడి ఉన్నామని తమకు ప్రత్యేకంగా విదేశీ పాలసీ ఏమీ లేదని పేర్కొన్నారు.ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు పాకిస్థాన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు దేశ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే మరోవైపు సరిహద్దు దేశమైన పాకిస్థాన్ తో చర్చలు జరపాలని అన్నారు. అయితే దత్తాత్రేయ హోసబాలే చేసిన వ్యాఖ్యల్ని తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సమర్థించారు. పాకిస్థాన్ లోని చాలా మంది ప్రజలు దేశం విడిపోవద్దని కోరుకున్నారని అన్నారు. అక్కడ ఉన్న పలువురు జర్నలిస్టులు కూడా ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనులను ప్రశంసిస్తున్నారని తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో జరిగే యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్థాన్ పూర్తిగా ఓడిపోతే.. అక్కడ ఉన్న ప్రజలను భారత్ లో భాగం చేయడమో లేకపోతే అక్కడి ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చేయాలన్నారు.ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ.. అత్యంత అపార్థానికి గురైన సంస్థ కూడా ఇదేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. మనం హిట్లర్ లాంటి వాళ్లము కాదు.. అది మన నైజం కాదు. అన్యాయాన్ని, క్రూరత్వాన్ని అణచివేయాలి. అలాగే లోకంలో ఉన్న మంచిని రక్షించాలి అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇక పాకిస్థాన్ ఉగ్ర మూకలు గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్
భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల ఇంటెరాక్టివ్ సెషన్ లో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ తో భారత్ చర్చలు జరపాలని ఆర్‌ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. పాకిస్థాన్ లోని ప్రజల గురించి దత్తాత్రేయ హోసబాలే ఆలోచించారని క్లారిటీ ఇచ్చారు. పాకిస్థాన్ విషయంలో కేంద్ర పాలసీకి తాము కట్టుబడి ఉన్నామని తమకు ప్రత్యేకంగా విదేశీ పాలసీ ఏమీ లేదని పేర్కొన్నారు.ఆర్‌ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు పాకిస్థాన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు దేశ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే మరోవైపు సరిహద్దు దేశమైన పాకిస్థాన్ తో చర్చలు జరపాలని అన్నారు. అయితే దత్తాత్రేయ హోసబాలే చేసిన వ్యాఖ్యల్ని తాజాగా ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సమర్థించారు. పాకిస్థాన్ లోని చాలా మంది ప్రజలు దేశం విడిపోవద్దని కోరుకున్నారని అన్నారు. అక్కడ ఉన్న పలువురు జర్నలిస్టులు కూడా ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న పనులను ప్రశంసిస్తున్నారని తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో జరిగే యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్థాన్ పూర్తిగా ఓడిపోతే.. అక్కడ ఉన్న ప్రజలను భారత్‌ లో భాగం చేయడమో లేకపోతే అక్కడి ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చేయాలన్నారు.ఆర్‌ఎస్‌ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ.. అత్యంత అపార్థానికి గురైన సంస్థ కూడా ఇదేనని ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. మనం హిట్లర్ లాంటి వాళ్లము కాదు.. అది మన నైజం కాదు. అన్యాయాన్ని, క్రూరత్వాన్ని అణచివేయాలి. అలాగే లోకంలో ఉన్న మంచిని రక్షించాలి అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇక పాకిస్థాన్ ఉగ్ర మూకలు గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే 7-10 మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత్ సైన్యం దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అప్పటినుంచి భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.