
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో సోదరులు లక్కీ, విక్కీ సాహస ప్రదర్శన చేపట్టారు. లక్కీ చేతుల పైనుంచి 100 కార్లు, విక్కీ శరీరం పైనుంచి 100 బైక్‌లు వరుసగా వెళ్లేలా విన్యాసాలు చేశారు. గిన్నిస్ రికార్డే లక్ష్యంగా అయాన్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిపుణుల పర్యవేక్షణలో చిన్నారులు ఈ సాహస ప్రదర్శన నిర్వహించారు. లక్కీ, విక్కీ ఇప్పటికే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. 100 కార్లు, 100 బైక్‌లతో సాహస ప్రదర్శన
|