
స్విట్జర్లాండ్ భవిష్యత్తును నిర్దేశించే ఒక కీలకమైన రెఫరెండంపై నేడు ఓటింగ్ జరుగుతోంది. దేశ జనాభాను కోటికి పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై ప్రజలు తమ తీర్పు ఇస్తున్నారు. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఐరోపా సమాఖ్య (ఈయూ)తో ఉన్న స్వేచ్ఛా కదలికల ఒప్పందంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఇది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది."10 మిలియన్ల స్విట్జర్లాండ్ వద్దు (సస్టైనబిలిటీ ఇనిషియేటివ్)" పేరుతో రైట్-వింగ్ స్విస్ పీపుల్స్ పార్టీ (ఎస్వీపీ) ఈ ప్రజాభిప్రాయ సేకరణను ముందుకు తెచ్చింది. దీని ప్రకారం, 2050 నాటికి దేశ జనాభా కోటి మార్కును దాటకుండా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్ జనాభా సుమారు 91 లక్షలుగా ఉంది. ప్రతిపాదన ప్రకారం, జనాభా 95 లక్షలకు చేరితే వలస నిబంధనలు, ఆశ్రయం, కుటుంబ పునరేకీకరణ వంటి అంశాలను కఠినతరం చేయాలి. ఒకవేళ కోటి దాటితే, ఈయూతో ఉన్న స్వేచ్ఛా కదలికల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తుంది.వలసల కారణంగా దేశంలో ఇళ్ల కొరత, రవాణా, ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని, జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికే ఈ ప్రతిపాదన అని ఎస్వీపీ వాదిస్తోంది.అయితే, స్విస్ ప్రభుత్వం, పార్లమెంట్, వాణిజ్య వర్గాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం చేకూరుస్తుందని, ఫార్మా, టెక్, ఫైనాన్స్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులపైనే దేశం ఆధారపడి ఉందని గుర్తుచేస్తున్నాయి. ఇది ఒకరకంగా 'స్విస్ బ్రెగ్జిట్' లాంటి అనిశ్చితికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నాయి. పోలింగ్‌కు ముందు