
విశ్వంలో అంగారక గ్రహం, చంద్రుడిపై ఉన్న భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇప్పుడు భూమిపైనే ఒక అద్భుతమైన పరిశోధన చేపట్టారు. స్పెయిన్లో ఏకైక ఉల్కాపాత గుంత వద్ద శాస్త్రవేత్తలు ఏకంగా 500 మీటర్ల లోతుకు భూగర్భ తవ్వకాలు జరుపుతున్నారు. సుమారు 80 లక్షల సంవత్సరాల క్రితం అంతరిక్షం నుంచి వచ్చిన ఒక భారీ ఉల్క భూమిని ఢీకొట్టినపుడు ఏర్పడిన వినాశనాన్ని.. దాని వెనక ఉన్న అంతరిక్ష రహస్యాలను ఛేదించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ వార్త చదివారా: చైనా గుట్టు చేరవేయండి.. తైవాన్ పిలుపు