
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎంత ఎదిగినా కన్నతల్లికి నితీశ్ ఇచ్చిన గౌరవాన్ని మెచ్చుకుంటూ లోకేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. Read also: Tirumala: తిరుమలలో జనసేన కార్యకర్తల నిబంధనల ఉల్లంఘన ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన బౌలింగ్‌తో రాణించాడు. ప్రమాదకరంగా మారిన సెంచరీ హీరో రహ్మనుల్లా గుర్బాజ్‌తో సహా రెండు కీలక వికెట్లు పడగొట్టి టీమిండియా విజయంలో భాగమయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత నితీశ్ మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఆయన మొబైల్ ఫోన్ మోగింది. అది తన తల్లి నుంచి వచ్చిన కాల్ అని గమనించిన నితీశ్.. ఏమాత్రం తడుముకోకుండా మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పారు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి “అమ్మా, నేను ప్రెస్ మీట్లో ఉన్నాను.. మళ్లీ కాల్ చేస్తాను” అని ఎంతో సున్నితంగా చెప్పి ఫోన్ పెట్టేసి, తిరిగి ప్రెస్ మీట్‌ను కొనసాగించారు. లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నితీశ్ ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ఆ వీడియోను షేర్ చేశారు. “క్రికెట్ అయినా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా.. ఎప్పుడైనా అమ్మే ఫస్ట్. వెల్ ప్లేయడ్ నితీశ్!” అంటూ నితీశ్ కుమార్ రెడ్డి సంస్కారాన్ని కొనియాడారు. అంతర్జాతీయ క్రికెట్ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ, ఎంతో ఒత్తిడితో కూడిన మీడియా సమావేశంలో ఉన్నప్పటికీ.. తల్లి పట్ల నితీశ్ చూపిన అమితమైన గౌరవం భేషనిపిస్తోంది. ఆటతోనే కాకుండా తన ఉన్నతమైన వ్యక్తిత్వంతో, సంస్కారంతో నితీశ్ కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్నాడంటూ నెటిజన్లు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. Tirumala: తిరుమలలో జనసేన కార్యకర్తల
నిబంధనల ఉల్లంఘన
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Banakacherla Project: గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు రిటైర్డ్ ఇంజనీర్ల మద్దతు.. సీఎం చంద్రబాబుకు లేఖ
Nara Lokesh: అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి: మంత్రి లోకేశ్
Notice to YCP MLA : వైసీపీ ఎమ్మెల్యేకు శ్రీశైలం దేవస్థానం నోటీసులు
AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
Srisailam Cottages Issue: శ్రీశైలంలో కాటేజీల వివాదం.. వైసీపీ ఎమ్మెల్యేకు ఆలయ అధికారుల నోటీసులు