
వర్షాలు, ప్రకృతి విపత్తులపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌లో మున్సిపల్, పోలీసు సిబ్బంది మధ్య సమన్వయం లేదు. నీరు నిలిచే ప్రాంతాల డేటా ఆధారంగా పనిచేయాలి. విద్యుత్ శాఖ సన్నద్ధం కావాలి. ఫీల్డ్‌లో ఉండని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి వరకు రోడ్లపై ఉండాల్సిందే. అవసరమైతే నేనూ రోడ్డు మీదకు వస్తా. వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు తప్పవు’’ అన్నారు. వర్షమొస్తే అధికారులంతా ఫీల్డ్‌లో ఉండాల్సిందే: రేవంత్‌రెడ్డి
|