
ప్రతిరోజూ ఒకేవిధంగా వంటకాలు తిని.. తిని ఇబ్బందిపడేదానికన్నా కొంచెం భిన్నంగా ఉండేలాగా ట్రైం చేద్దాం అనుకునేవారికి ఈ వెరైటీ వంటకాలు సరిగ్గా ఉపయోగపడుతాయి. అయితే ఇప్పుడే వాటిని ఇలా రెడీ చేయండి. బాంబే ఐస్ హల్వా.. కావలసినవి: పాలు: ఒకటిన్నర కప్పు, పంచదార: కప్పు, కార్న్ ఫ్లోర్: 1/4 కప్పు, నెయ్యి: 1/4 కప్పు, ఆరెంజ్ ఫుడ్ కలర్: టీ స్పూన్, ఏలకుల పొడి: కొద్దిగా, బాదం ముక్కలు: టేబుల్ స్పూన్, పిస్తా ముక్కలు: టేబుల్ స్పూన్. ఒక పెద్ద కడాయిలో కప్పు పాలు, పంచదార, కార్న్ ఫ్లోర్, నెయ్యి వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్‌లో ఉంచి ఉండలు కట్టకుండా గరిటెతో రౌండ్‌గా కలుపుతుండాలి. ఈ మిశ్రమం చిక్కబడి పేస్ట్‌లా మారిన తరువాత ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్‌తో పాటుగా నెయ్యి వేయండి. మంటను మీడియంలో ఉంచి బాగా కలపండి. ఆ తరువాత టీస్పూన్ ఏలకుల పొడి వేసి బాగా కలపండి. మిశ్రమం అంతా జిగటగా, మెరుస్తూ మారేంత వరకు కలపండి. ఒకవేళ అలా మెరవకపోతే మరికొద్దిగా నెయ్యి వేసి కలపండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుని, దానిపై ఒక గరిటెడు ఐస్ హల్వా మిశ్రమాన్ని వేసి, దీనిపై నెయ్యి రాసిన మరొక బటర్ పేపర్ షీట్‌ను ఉంచి చేతితో మెల్లగా నొక్కండి. ఆపై చపాతీ కర్ర సహాయంతో మీకు నచ్చిన మందంలో పరచండి. పైనున్న బటర్ పేపర్‌ను మెల్లగా తీసివేసి, పైన తరిగిన బాదం, పిస్తా ముక్కలను చల్లి 15 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచండి. హల్వా పూర్తిగా గట్టిపడిన తర్వాత, బటర్ పేపర్‌తో సహా ముక్కలుగా కట్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన బాంబే ఐస్ హల్వా సిద్ధం! ఒక గిన్నెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారట్ ముక్కలను తీసుకోండి. అందులో కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి
Jun 14 2026 2:10 PM | Updated on Jun 14 2026 2:10 PM
ప్రతిరోజూ ఒకేవిధంగా వంటకాలు తిని.. తిని ఇబ్బందిపడేదానికన్నా కొంచెం భిన్నంగా ఉండేలాగా ట్రైం చేద్దాం అనుకునేవారికి ఈ వెరైటీ వంటకాలు సరిగ్గా ఉపయోగపడుతాయి. అయితే ఇప్పుడే వాటిని ఇలా రెడీ చేయండి.
బాంబే ఐస్ హల్వా.. కావలసినవి: పాలు: ఒకటిన్నర కప్పు, పంచదార: కప్పు, కార్న్ ఫ్లోర్: 1/4 కప్పు, నెయ్యి: 1/4 కప్పు, ఆరెంజ్ ఫుడ్ కలర్: టీ స్పూన్, ఏలకుల పొడి: కొద్దిగా, బాదం ముక్కలు: టేబుల్ స్పూన్, పిస్తా ముక్కలు: టేబుల్ స్పూన్.
ఒక పెద్ద కడాయిలో కప్పు పాలు, పంచదార, కార్న్ ఫ్లోర్, నెయ్యి వేసుకోండి.
స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్‌లో ఉంచి ఉండలు కట్టకుండా గరిటెతో రౌండ్‌గా కలుపుతుండాలి.
ఈ మిశ్రమం చిక్కబడి పేస్ట్‌లా మారిన తరువాత ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్‌తో పాటుగా నెయ్యి వేయండి.
మంటను మీడియంలో ఉంచి బాగా కలపండి. ఆ తరువాత టీస్పూన్ ఏలకుల పొడి వేసి బాగా కలపండి.
మిశ్రమం అంతా జిగటగా, మెరుస్తూ మారేంత వరకు కలపండి.
ఒకవేళ అలా మెరవకపోతే మరికొద్దిగా నెయ్యి వేసి కలపండి.
ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకుని, దానిపై ఒక గరిటెడు ఐస్ హల్వా మిశ్రమాన్ని వేసి, దీనిపై నెయ్యి రాసిన మరొక బటర్ పేపర్ షీట్‌ను ఉంచి చేతితో మెల్లగా నొక్కండి.
ఆపై చపాతీ కర్ర సహాయంతో మీకు నచ్చిన మందంలో పరచండి. పైనున్న బటర్ పేపర్‌ను మెల్లగా తీసివేసి, పైన తరిగిన బాదం, పిస్తా ముక్కలను చల్లి 15 నిమిషాల పాటు రిఫ్రిజిరేటర్లో ఉంచండి.
హల్వా పూర్తిగా గట్టిపడిన తర్వాత, బటర్ పేపర్‌తో సహా ముక్కలుగా కట్ చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన బాంబే ఐస్ హల్వా సిద్ధం!
ఒక గిన్నెలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారట్ ముక్కలను తీసుకోండి.
అందులో కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
ఈ కూరగాయల మిశ్రమాన్ని ముక్కలు కాస్త మెత్తబడే వరకు పాన్ పై లైట్‌గా వేయించి పక్కన పెట్టుకోండి.
ఆ తర్వాత ఒక బ్రెడ్ ముక్కను తీసుకుని, ఒక వైపు మాత్రమే లైట్‌గా కాల్చండి.
ఇప్పుడు బ్రెడ్ కాల్చిన వైపున మనం తయారుచేసి పెట్టుకున్న వెజిటబుల్ మసాలా మిశ్రమాన్ని సమానంగా పరచండి.
ఆ మసాలా పైన తగినంత చీజ్ వేసి, దానిని కరగనివ్వండి.
బ్రెడ్ కింద వైపు చక్కగా క్రిస్పీగా కాలిన తర్వాత, అలాగే పైన చీజ్ పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే వేడివేడి సువాసనలతో కూడిన మసాలా చీజ్ టోస్ట్ సిద్ధం.
ఖట్టా మూంగ్.. కావలసినవి: పచ్చ పెసలు: 2 కప్పులు (నానబెట్టినవి), పుల్లటి పెరుగు: కప్పు, శనగపిండి: 3 టేబుల్ స్పూన్లు, కారం: 2 టీస్పూన్లు, పసుపు: 2 టీస్పూన్లు, ధనియాల పొడి: 2 టీస్పూన్లు, జీలకర్ర: టీస్పూన్, ఆవాలు: టీస్పూన్, పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి), కరివేపాకు: 5–6 ఆకులు, అల్లం ముక్కలు (సన్నని తరుగు): 5–6, కొత్తిమీర: 1/2 కప్పు (సన్నగా తరిగినది), నూనె: సరిపడినంత, నీళ్లు.
ముందుగా నానబెట్టిన పెసలను ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోండి.
అందులో మూడు కప్పుల నీళ్లు పోసి, మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
పెసలు ఉడికేలోపు, ఒక గిన్నెలో శనగపిండి, పుల్లటి పెరుగు, కారం, పసుపు, ఒక కప్పు నీరు వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, మీడియం మంట మీద కొన్ని సెకన్ల పాటు వేయించండి.
తాలింపు వేగాక, ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును పాన్‌లో వేసి, తాలింపు అంతా పప్పుకు పట్టేలా బాగా కలిపి.. రెండు నిమిషాల పాటు ఉడికించండి.
ఆ తర్వాత, మనం సిద్ధం చేసి పెట్టుకున్న శనగపిండి–పెరుగు మిశ్రమాన్ని, ధనియాల పొడిని ఇందులో వేసి బాగా కలపండి.
మంటను సిమ్‌లో పెట్టి 3–4 నిమిషాల పాటు ఉడకనిచ్చి, స్టవ్ ఆఫ్ చేయండి.
చివరగా పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర, అల్లం ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుజరాతీ స్పెషల్ ఖట్టా మూంగ్ రెడీ! ఇది చపాతీలు, పూరీలు, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది.
ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)
కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21)
మూడు ముళ్ల బంధానికి పద్నాలుగేళ్లు..ముచ్చటగా ముగ్గురు పిల్లలు (ఫోటోలు)
కెప్టెన్ అవ్వగానే రేంజ్ మారింది.. ముంబైలో శ్రేయస్ ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
తల్లికి ఎగనామం.. బిడ్డలకు పంగనామం.. చేతులెత్తేసిన చంద్రబాబు
వరంగల్ లో కీచక ఎస్సై.. నగ్న ఫోటోలు బయటపెడతానంటూ..