
ఏళ్ల పాటు ఒకే సినిమాను చెక్కుతూనే ఉన్న
మనం చేసిన పని మరోసారి చేయాలంటే విసుక్కుంటాం. సణుక్కుంటాం.అవసరం అనుకుంటే తప్పదురా దేవుడా అని తలపట్టుకుని పూర్తి చేస్తాం. అలాంటిది ఓ దర్శకుడు ఒక సినిమాని ఇరవై ఏళ్ల పాటు నిరంతరం చెక్కుతూనే ఉంటారా? అదీ ఒక కొత్త సినిమా కాదు. అప్పటికే విడుదలైపోయి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, Hollywoodలో తన పేరును ఒక ప్రత్యేక స్థానంలో నిలిపిన సినిమా. అయినా దర్శకుడికి మాత్రం అది పూర్తయినట్టుగా అనిపించలేదు. అది కూడా ఏదో కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన దర్శకుడు కాదు. ఒక సినిమా తీసి వెంటనే గ్యాప్ లేకుండా ఇంకో సినిమాకు వెళ్ళిపోయే సాధారణ filmmaker అంతకన్నా కాదు. Alien, Gladiator, Black Hawk Down లాంటి చిత్రాలతో ప్రపంచ సినిమాపై తన ముద్ర వేసిన Ridley Scott. అలాంటి దర్శకుడు ఒకే సినిమాను పట్టుకుని దాదాపు పావు శతాబ్దం పాటు మళ్లీ మళ్లీ చెక్కాడు. అంటే బోర్ కొట్టలేదా? లేదు! అక్కడే ఈ కథలో అసలు ఇంట్రస్టింగ్ విషయం ఉంది. 1982లో విడుదలైన ఈ sci-fi masterpieceకు, Ridley Scott తనకు కావాల్సిన తుది రూపాన్ని ఇవ్వడానికి 2007 వరకు పట్టింది. ఆ రూపమే ‘Blade Runner: The Final Cut’. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అదే Final Cut అమెరికాలో YouTubeలో adsతో ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. కానీ YouTubeలో ఉచితంగా దొరకడం అనేది ప్రక్కన పెడితే ..ఒక దర్శకుడు తన సినిమా విడుదలైపోయిన 25 ఏళ్ల తర్వాత కూడా దాన్ని ఎందుకు వదల్లేదు? సినిమా పూర్తయింది.. కానీ దర్శకుడికి కాదు! Ridley Scott తెరకెక్కించిన Blade Runner ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు దాని కథ భవిష్యత్తులోని Los Angeles నేపథ్యంలో సాగుతుంది. మనుషుల్లా కనిపించే Replicants అనే artificial beingsను భారీ కార్పొరేట్ సంస్థలు తయారు చేసి, శ్రమ కోసం ఉపయోగిస్తాయి. వాటికి పరిమిత జీవితకాలాన్ని నిర్ణయిస్తాయి


