
వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కుదుళ్లలో నేచురల్ ఆయిల్స్ తగ్గిపోతాయి. దీంతో తల పొడిబారిపోయి జుట్టు బలహీనంగా మారుతుంది. తద్వారా జుట్టు పల్చబడుతుంది. అందుకే వీలైనంత వరకు గోరువెచ్చని లేదా చల్లటి నీళ్లతో తలస్నానం చేయడం మేలు.
తలస్నానం చేశాక కొంతమంది జుట్టు ఆరడం కోసం టవల్‌తో గట్టిగా రుద్దుతుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనంగా మారి వెంట్రుకలు తెగిపోతాయి. దీంతో జుట్టు పల్చగా మారుతుంది. అందుకే టవల్‌ను నెమ్మదిగా ఉపయోగించడం మేలు.
కొంతమంది సమయం లేదని తడి జుట్టుతోనే దువ్వుతుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు తొందరగా తెగిపోయి పల్చగా మారుతుంది. అందువల్ల వీలైనంత వరకు పూర్తిగా ఆరిన తర్వాతే దువ్వడం మేలు.
షాంపూ, కండిషనర్ వంటి వాటిలో కెమికల్స్ ఎక్కువగా ఉంటే అవి కుదుళ్లకు హాని చేస్తాయి. తద్వారా జుట్టు బలహీనపడి రాలుతుంది. అందుకే వీలైనంత వరకు కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ ప్రోడక్టులు ఉపయోగించడం మేలు.
హెయిర్ స్టైటెనర్, కర్లింగ్ ఐరన్, హెయిర్ డ్రైయర్ వంటి హీట్ స్టైలింగ్ పరికరాలు ఉపయోగించడం వల్ల ఆ వేడికి జుట్టు తొందరగా డ్యామేజ్ అవుతుంది. దీంతో జుట్టు పల్చగా మారుతుంది.
పోనీ టైయిల్, బన్ వంటి టైట్ హెయిర్ స్టైల్స్ వల్ల కుదుళ్లపై రాపిడి పెరిగి జుట్టు పల్చగా మారుతుంది. అందుకే వీలైనంత వరకు లూజ్ హెయిర్ స్టైల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
కొంతమంది వారం వరకు తలస్నానం చేయకుండా ఉంటారు. ఇలా చేస్తే జుట్టు కుదుళ్లలో మురికి, జిడ్డు పేరుకుపోయి జుట్టు రాలుతుంది. అందుకే కనీసం వారానికి 2-3 సార్లు తలస్నానం చేయాలి. అలాగే వారంలో రెండుసార్లు గోరువెచ్చని నూనెతో తలకు మర్దన చేసుకోవాలి.
జంగ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. అందుకే జుట్టు ఆరోగ్యానికి సహాయపడే జింక్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి. దీంతో జుట్టు హెల్తీగా పెరుగుతుంది.
వాతావరణ కాలుష్యం వల్ల జుట్టు తొందరగా పల్చగా మారే అవకాశం ఉంది. అందుకే బయటకు వెళ్లినపుడు క్యాప్ లేదా స్కార్ఫ్ ధరించడం ఉత్తమం.
Recommended for you
Found this helpful?
Share this story with your network









