
దేశ విద్యా రంగాన్ని కుదిపేస్తున్న నీట్ (NEET-UG) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన దేశవ్యాప్త నిరసన జ్వాలలు భాగ్యనగరానికి తాకాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్తో హైదరాబాద్లోని ధర్నా చౌక్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ బహిరంగ నిరసన ప్రదర్శన జరిగింది.విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న పాలకుల తీరుకు వ్యతిరేకంగా తరలివచ్చిన ఆందోళనకారులతో ఇందిరా పార్క్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో, గోడీ మీడియా హై హై అంటూ నినాదాలతో ధర్నా చౌక్ మార్మోగింది. ఈ మహాధర్నాకు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి హాజరై తమ మద్దతు ప్రకటించారు.లాల్ బహదూర్ శాస్త్రి నైతికత ఏది?ఈ నిరసన సభను ఉద్దేశించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడం సిగ్గుచేటన్నారు. గతంలో ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ నాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేసిన చారిత్రాత్మక ఉదాహరణను ఆయన గుర్తుచేశారు.నేటి పాలకులు కనీస నైతిక బాధ్యత లేకుండా విద్యార్థుల జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు అధ్వాన్నంగా మారడం వల్లే పేదలు ప్రైవేట్ సంస్థల వైపు వెళ్లాల్సి వస్తోందని సభలో పాల్గొన్న పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థలో వేళ్లూనుకున్న కులతత్వానికి రోహిత్ వేముల లాంటి ఎందరో మేధావులు బలిపశువులవుతున్నారని సీజేపీప్రతినిధి విజేత దహియా మండిపడ్డారు. ఇలా చేస్తేనే కాక్రోచ్ లు బయటకు వస్తాయి చంద్రబాబు.. జాగ్రత్త..!!కలచివేసిన యదార్థ గాథలు!ఈ లీకేజీల వల్ల పేద కుటుంబాల ఆశలు ఎలా సమాధి అవుతున్నాయో వివరిస్తూ ఆకాంక్ష చతుర్వేది, ప్రదీప్ అనే విద్యార్థుల
దేశ విద్యా రంగాన్ని కుదిపేస్తున్న నీట్ (NEET-UG) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన దేశవ్యాప్త నిరసన జ్వాలలు భాగ్యనగరానికి తాకాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం భారీ బహిరంగ నిరసన ప్రదర్శన జరిగింది.విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న పాలకుల తీరుకు వ్యతిరేకంగా తరలివచ్చిన ఆందోళనకారులతో ఇందిరా పార్క్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తీఫా దో, గోడీ మీడియా హై హై అంటూ నినాదాలతో ధర్నా చౌక్ మార్మోగింది. ఈ మహాధర్నాకు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి హాజరై తమ మద్దతు ప్రకటించారు.లాల్ బహదూర్ శాస్త్రి నైతికత ఏది?ఈ నిరసన సభను ఉద్దేశించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో ఇంత పెద్ద కుంభకోణం జరిగినా కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడం సిగ్గుచేటన్నారు. గతంలో ఒక రైలు ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ నాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేసిన చారిత్రాత్మక ఉదాహరణను ఆయన గుర్తుచేశారు.నేటి పాలకులు కనీస నైతిక బాధ్యత లేకుండా విద్యార్థుల జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు అధ్వాన్నంగా మారడం వల్లే పేదలు ప్రైవేట్ సంస్థల వైపు వెళ్లాల్సి వస్తోందని సభలో పాల్గొన్న పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థలో వేళ్లూనుకున్న కులతత్వానికి రోహిత్ వేముల లాంటి ఎందరో మేధావులు బలిపశువులవుతున్నారని సీజేపీప్రతినిధి విజేత దహియా మండిపడ్డారు. ఇలా చేస్తేనే కాక్రోచ్ లు బయటకు వస్తాయి చంద్రబాబు.. జాగ్రత్త..!!కలచివేసిన యదార్థ గాథలు!ఈ లీకేజీల వల్ల పేద కుటుంబాల ఆశలు ఎలా సమాధి అవుతున్నాయో వివరిస్తూ ఆకాంక్ష చతుర్వేది, ప్రదీప్ అనే విద్యార్థుల ఉదంతాలను సభలో ప్రస్తావించారు. డాక్టర్ చదివి కుటుంబ కష్టాలు తీరుస్తానని.. తండ్రి తెచ్చిన మూడు లక్షల అప్పు తీరుస్తానని నమ్మకంగా ఉన్న ఆకాంక్ష, పేపర్ లీక్ వార్తలతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడిన ఉదంతం కన్నీళ్లు పెట్టించింది.చనిపోయిన కొడుకు కెమిస్ట్రీ పుస్తకాన్ని గుండెలకు హత్తుకుని నేటికీ రోదిస్తున్న ఒక పేద తండ్రి వేదనను సభ ముందు ఉంచారు. అసమర్థులు, చదువురాని వారు ఉన్నత స్థానాల్లో కూర్చుంటే సమాజానికి ముప్పు వాటిల్లుతుంది. ఈ అబద్ధాల నెట్‌వర్క్‌ను ఛేదించేందుకే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం పుట్టింది అని నేతలు స్పష్టం చేశారు.ఇది కేవలం పార్టీ కాదు.. ప్రజలను మేల్కొలిపే సైన్యం: సోనమ్ వాంగ్‌చుక్ధర్నా చౌక్‌కు చేరుకున్న ప్రముఖ పర్యావరణవేత్త, రామన్ మెగసేసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్‌కు నిరసనకారులు సోనమ్ సర్ తుంకో లాల్ సలామ్ అంటూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాక్రోచ్ జనతా పార్టీ కేవలం ఒక రాజకీయ వేదిక కాదని, ప్రతి భారతీయుడిని నిద్రలేపే ఒక చైతన్య ఉద్యమమని అభివర్ణించారు. దేశ ప్రధానితో సహా ప్రతీ ఒక్కరినీ జవాబుదారీగా చేసే విద్యా సంస్కరణలు రావాలన్నారు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేనప్పుడు అది ప్రజాస్వామ్యమే కాదని, సింగపూర్ లాంటి దేశాలు గతాన్ని మర్చిపోయి సామరస్యంతో ఎలా ఎదిగాయో భారత్ కూడా ద్వేషాన్ని వీడి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాక్రోచ్ దెబ్బకి దద్దరిల్లిన దిల్లీ.. జూన్ 23న మరో నిరసన..కాంక్రీట్ జంగిల్ అభివృద్ధి కాదు.. పర్యావరణ పరిరక్షణే ముఖ్యంఈ నిరసన వేదిక ద్వారా కేవలం విద్యపైనే కాకుండా పర్యావరణ హననంపై కూడా సీజేపీ గళమెత్తింది. నగరాలను కాంక్రీట్ వనంగా మార్చడం అందం కాదని, చెట్లను నరుకుతూ చేసే అభివృద్ధి వినాశనానికి దారితీస్తుందని ప్రతినిధులు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ నేషనల్ పార్క్ (KBR Park) పరిరక్షణ కోసం ఇక్కడి ప్రజలు చేస్తున్న పోరాటాన్ని సోనమ్ వాంగ్‌చుక్ అభినందించారు. దేశంలో భయానక వాతావరణాన్ని వీడి, పారదర్శకమైన విద్యావ్యవస్థ, స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న నవభారతాన్ని నిర్మించేందుకు యువత కదలిరావాలని పిలుపునిచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ.