
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ సంస్థ ‘ఆంథ్రోపిక్’ ఇటీవల విడుదల చేసిన తమ సరికొత్త ఏఐ మోడళ్లు ‘ఫ్యాబిల్ 5’, ‘మిథోస్ 5’ సేవలను నిలిపివేసింది. అయితే దీని వెనకాల అమెజాన్ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏఐ మోడళ్లలో కొన్ని ఇబ్బందులను గుర్తించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే అమెరికా ఆంథ్రోపిక్ ఆధునాతన మోడళ్లను విదేశీయులు వాడకుండా నిషేధించినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఆంథ్రోపిక్ ‘ఫ్యాబిల్ 5’ మోడల్‌ను ఇటీవల విడుదల చేయగా.. దీనిపై అమెజాన్ పరిశోధకులు కొన్ని పరీక్షలు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏఐ మోడల్స్ సాఫ్ట్వేర్ లోపాలను బయటపెట్టకుండా ఉండేందుకు అందులో భద్రతపరమైన ఫిల్టర్లు ఉంటాయి. కానీ అమెజాన్ పరిశోధకులు ప్రత్యేకమైన ప్రాంప్ట్‌లను ఉపయోగించడంతో ఫ్యాబిల్-5 మోడల్లో భద్రతా నిబంధనలను దాటవేసే సాఫ్ట్వేర్ లోపాలను గుర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ విభాగానికి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అధునాతన సాంకేతికత సాయంతో సైబర్ నేరగాళ్లు సులువుగా హ్యాకింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని ట్రంప్ సర్కారు ఆరోపించింది. ఈ ఏఐ టూల్స్‌తో సాఫ్ట్వేర్ కోడ్‌లోని లోపాలను సులువుగా గుర్తించి హ్యాకర్లు దుర్వినియోగం చేసే ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఫ్యాబిల్ 5, మిథోస్ 5 ఏఐ మోడళ్లను విదేశీ పౌరులకు నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆంథ్రోపిక్‌లో పనిచేసే విదేశీ ఉద్యోగులకు కూడా ఈ మోడళ్ల యాక్సెస్ ఉండకూడదని స్పష్టంచేసింది. దీనిపై స్పందించిన ఆంథ్రోపిక్.. విదేశీ పౌరులే గాక.. యూజర్లందరికీ వీటి సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా
లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.