
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. India-Iran Relations News: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా మారుతున్న ఈ సమీకరణాలు భారతదేశానికి వ్యూహాత్మకంగా, ఆర్థికంగా సరికొత్త అవకాశాలను తెచ్చిపెట్టబోతున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన భారత్-ఇరాన్ వాణిజ్య సంబంధాలు మళ్లీ ఊపందుకోవడమే కాకుండా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడానికి ఇది ఒక సువర్ణావకాశంగా మారనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌కు చేకూరే ప్రధాన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చౌక ధరకే ముడి చమురు.. భారతదేశం తన దేశీయ ఇంధన అవసరాల కోసం దాదాపు 85 శాతం ముడి చమురును దిగుమతులపైనే ఆధారపడుతోంది. అమెరికా, ఇరాన్ ఒప్పందం సఫలమైతే భారత్‌కు భారీ ఊరట లభించనుంది. వెనిజులా లేదా అమెరికా నుంచి వచ్చే చమురులో సల్ఫర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల దానిని క్లీన్ చేయడానికి ఎక్కువ ఖర్చవుతుంది. కానీ ఇరాన్ ముడి చమురు సాధారణ రకానికి చెందినది కావడం వల్ల శుద్ధి ఖర్చులు చాలా తక్కువ. అలాగే ఇరాన్ నుంచి దిగుమతులు పునఃప్రారంభమైతే రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు గణనీయంగా తగ్గుతాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. భారత్ దిగుమతి చేసుకునే చమురులో 50 శాతం వివాదాస్పద 'హార్ముజ్ జలసంధి' గుండానే ప్రయాణించాలి. ఇరాన్‌తో సత్సంబంధాలు ఉంటే ఈ సముద్ర రవాణా మార్గానికి పూర్తి భద్రత లభిస్తుంది. చాబహార్ పోర్ట్ ప్రాజెక్టుకు పునర్జీవం భారత్ వ్యూహాత్మకంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఇరాన్‌లోని చాబహార్ నౌకాశ్రయ అభివృద్ధికి
ఈ ఒప్పందం కీలక చోదక శక్తి కానుంది. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ద్వారా ఈ పోర్ట్ నిర్వహణకు భారత్ 10 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. యంత్రాల కోసం 120 మిలియన్ డాలర్ల పెట్టుబడితో పాటు, మౌలిక వసతుల కోసం 250 మిలియన్ డాలర్ల రుణ సదుపాయాన్ని కూడా ప్రకటించింది.
పాకిస్థాన్‌లో చైనా నిర్మిస్తున్న 'గ్వాదర్' పోర్టుకు చాబహార్ అత్యంత సమీపంలో ఉంటుంది. దీని ద్వారా పశ్చిమాసియాలో చైనా ఆధిక్యానికి భారత్ బ్రేక్ వేయవచ్చు. పాకిస్థాన్‌తో ఎలాంటి అవసరం లేకుండానే భారత్ నేరుగా మధ్య ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలకు వాణిజ్యం సాగించడానికి చాబహార్ ఒక వ్యూహాత్మక గేట్వేగా మారుతుంది.
గతంలో అంతర్జాతీయ వేదికలపై (జమ్మూ కాశ్మీర్ వంటి కీలక అంశాల్లో) ఇరాన్ భారత్‌కు ఎంతో అండగా నిలిచింది. అయితే అమెరికా ఆంక్షల ప్రభావం ఈ బంధంపై తీవ్రంగా పడింది.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కేవలం మానవతా సహాయం, ప్రాథమిక అవసరాల వస్తువులకే వాణిజ్యం పరిమితమైంది. భారత్ నుంచి బాస్మతీ బియ్యం, టీ పొడి, మందులు ఇరాన్‌కు వెళ్తుండగా.. అక్కడి నుంచి ఎండుద్రాక్ష, రసాయనాలు భారత్‌కు వస్తున్నాయి.
గతంలో అమెరికా ఒత్తిళ్ల కారణంగా భారత్.. ఇరాన్ విషయంలో కొంత తటస్థ వైఖరిని అవలంబించాల్సి వచ్చింది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన కూడా అప్పట్లో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే, ఇప్పుడు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం ముగింపు దశకు చేరడం భారత దౌత్య, ఆర్థిక ప్రయోజనాలకు లభించిన అతిపెద్ద ఊరట. ఆంక్షలు సడలిస్తే చమురు మార్కెట్లో స్థిరత్వం ఏర్పడటంతో పాటు, ఆసియా వ్యాప్తంగా భారత్ తన ఆర్థిక పట్టును మరింత సుస్థిరం చేసుకోగలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.