
Somvati Amavasya in adhik mass: అధికమాసంలో వచ్చిన సోమవతి అమావాస్య మరింత గొప్పదని, ఈ రోజు చేేసే దానధర్మాలు, పరిహారాలు, పూజలు కోట్ల రెట్లు మంచి ఫలితాలు ఇస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రోజున అసలుఏమేం చేయాలో పలు సూచనలు చేశారు. జ్యోతిష్య పండితుల ప్రకారం అధిక మాసం చాలా గొప్పదని దీనినే పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఇది జూన్ 15తో ముగియనుంది. ఈసారి అధికమాసం ముగింపు వేళ అమావాస్య అది కూడా సోమవారం రావడంతో చాలా విశేషంగా చెప్తున్నారు. దీన్ని సోమవతి అమావాస్యగా పిలుస్తారు. ఇంతే కాకుండా మరో అరుదైన కలయిక కూడా చోటు చేసుకుంది. అమావాస్య సోమవారం అది కూడా, సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల మిథున సంక్రాంతి పండుగ కూడా జరుపుకుంటారు. ఇన్ని కాంబినేషన్లు ఉండటం వల్ల సోమవాతి అమవాస్య చాలా విశేషమైందని పండితులు చెబుతున్నారు. సూర్య సంక్రాంతి, అధిక మాసం కలయిక అనేక శతాబ్దాలలో ఒక్కసారి మాత్రమే జరుగుతుందని, ప్రస్తుతం ఏర్పడబోతున్న కాంబినేషన్ 396 సంవత్సరాల తర్వాత ఒక అరుదైన సంఘటన అని పండితులు చెబుతున్నారు. ఈ అరుదైన యోగం గతంలో 1630వ సంవత్సరం జూన్ 10న సంభవించింది. అంటే 396 సంవత్సరాల క్రితం! ఇన్ని సంవత్సరాల తర్వాత, ఈ విశిష్టమైన గ్రహస్థితి 2026లో మళ్ళీ ఏర్పడుతోంది. ఆ తర్వాత మరల 2327వ సంవత్సరం జూన్ 20న చూస్తాము. అందుకే ఈ రోజున చేసే ఏ పూజలైన, పుణ్యస్నానాలైనా,వ్రతాలు అయిన, దానధర్మాలైనా కోట్లాది రెట్లు అదృష్టాన్ని తెస్తాయని పండితులు చెబుతున్నారు. సోమవతి అమావాస్య రోజు శివయ్యకు పంచామృత అభిషేకం నిర్వహించాలి. ఏలినాటి, అర్దాష్టమ, అష్టమ శనిదోషాలు ఉన్నవారు ప్రత్యేకంగా పూజలు, దాన ధర్మాలు చేయించుకొవాలి. ఇక చనిపోయిన మన పూర్వీకులకు పిండ ప్రదానాలు నదీ పరివాహక ప్రాంతం వద్ద జరిపించుకొవాలి. ముఖ్యంగా సోమవతి అమావాస్య రోజున అశ్వత్థ చెట్టు కింద నెయ్యితో
దీపారాధన చేయాలి.నల్లని చీమలకు చక్కెర, బెల్లంలను తినేందుకు పెట్టాలి. నిమ్మకాయ తొక్కలు లేదా కొబ్బరి కాయలో నూనెతో దీపాన్ని వెలిగించాలి. అధిక మాసం ముగింపు వేళ పండితులకు శక్తి ప్రకారం ఏవైన పండ్లు, డ్రైఫ్రూట్స్ దానంగా ఇచ్చుకొవాలి.
సోమవతి అమావాస్య ఇతర అమావాస్యల కంటే చాలా శక్తివంతమైనదని, గొప్పదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అమావాస్య నాడు ఆవులకు పశుగ్రాసం, పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేయడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అమావాస్య ఉదయం, పవిత్ర నదిలో స్నానం చేసి ఆతర్వాత సూర్యునికి 'అర్ఘ్యం' సమర్పించాలి. మిథున సంక్రాంతి నాడు సూర్య భగవానుడిని పూజించుకొవడం వల్ల గొప్ప శుభఫలితాలు కల్గుతాయని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా సోమవతి అమావాస్య రోజున అశ్వత్థ చెట్టు కింద నెయ్యితో దీపారాధన చేయాలి. నల్లని చీమలకు చక్కెర, బెల్లంలను తినేందుకు పెట్టాలి. తమ పూర్వీకులకు ఇష్టమైన వస్తువులు కానీ ఆహర పదార్థాలను దానంగా ఇవ్వాలి.( గమనిక - ఈ స్టోరీ కేవలం నమ్మకం, విశ్వాసాలకు సంబంధించిన మాత్రమే. జీ తెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)