
ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన టెక్నాలజీ ఇప్పుడు మీ డెస్క్‌పై, మీ మెడలో, మీ చేతిలోకి వచ్చేసింది. ఆశ్చర్యపరిచే ఫీచర్లతో, ఆకట్టుకునే డిజైన్లతో ఉన్న ఈ గాడ్జెట్స్ నిజంగానే ఫ్యూచర్ వైబ్స్ ఇస్తాయి! చేతికి కట్టుకునే స్పేస్ ల్యాబ్! మీ మణికట్టుపై టైమ్ మాత్రమే కాదు, ఒక చిన్న అంతరిక్ష ప్రయోగశాల కూడా ఉండాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ‘నాసా ఆర్టెమిస్ వాచ్ 2.0!’ చంద్రయాన్ కలలు కనే టెక్నాలజీ ప్రియుల కోసం రూపొందించిన ఈ స్మార్ట్ వాచ్ చూడటానికి స్టయిలిష్‌గా ఉంటుంది. ఇందులో ఉన్న యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, బ్లూటూత్ వంటి సెన్సర్లతో మీ రోజువారీ కదలికలను ట్రాక్ చేయవచ్చు. అయితే దీని అసలు ప్రత్యేకత వేరే! ఈ వాచ్‌ను మీకు నచ్చినట్టుగా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. కొత్త వాచ్ ఫేస్‌లు డిజైన్ చేయడం, చిన్న చిన్న ఆటలు తయారు చేయడం, మీ సొంత యాప్‌లను రూపొందించడం కూడా సాధ్యమే. టెక్నాలజీని సరదాగా నేర్చుకోవాలనుకునే పిల్లలకు, యువతకు ఇది ఒక మినీ లెర్నింగ్ ల్యాబ్‌లా పనిచేస్తుంది. ధర రూ. 10,700. మాట్లాడే బుజ్జి రోబో! కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఆఫీస్ టేబుల్‌పై కూర్చుని పని చేస్తున్నప్పుడు మీతో కబుర్లు చెప్పే ఓ చిన్న ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి ఫ్యూచరిస్టిక్ ఫన్ ను తీసుకొచ్చే గాడ్జెట్ ఇదే. ఏఐ వాయిస్ ఇంటరాక్షన్ కంపానియన్ రోబో! చూడటానికి చిన్న బొమ్మలా కనిపించినా, ఇందులో ఉన్న స్మార్ట్ వాయిస్ ఇంటరాక్షన్ ఫీచర్‌తో మీ మాటలకు స్పందిస్తూ సరదాగా ఇంటరాక్ట్ అవుతుంది. దీని చిన్న డిస్ప్లేలో కనిపించే క్యూట్ యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్స్ వల్ల ఇది నిజంగానే ఎమోషన్స్ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు మాట్లాడితే ఇది రియాక్ట్ అవుతూ, టేబుల్‌పై కూర్చున్న చిన్న డిజిటల్ పెట్లా ఫీల్ ఇస్తుంది. మాగ్నెటిక్ మౌంట్‌కు సపోర్ట్ ఉండటంతో కార్ డ్యాష్‌బోర్డ్‌పై సులభంగా అమర్చుకోవచ్చు. ధర రూ. 18,000. మెడలోనే
Jun 14 2026 1:44 PM | Updated on Jun 14 2026 1:44 PM
ఒకప్పుడు సినిమాల్లో మాత్రమే కనిపించిన టెక్నాలజీ ఇప్పుడు మీ డెస్క్‌పై, మీ మెడలో, మీ చేతిలోకి వచ్చేసింది. ఆశ్చర్యపరిచే ఫీచర్లతో, ఆకట్టుకునే డిజైన్లతో ఉన్న ఈ గాడ్జెట్స్ నిజంగానే ఫ్యూచర్ వైబ్స్ ఇస్తాయి!
చేతికి కట్టుకునే స్పేస్ ల్యాబ్! మీ మణికట్టుపై టైమ్ మాత్రమే కాదు, ఒక చిన్న అంతరిక్ష ప్రయోగశాల కూడా ఉండాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ‘నాసా ఆర్టెమిస్ వాచ్ 2.0!’ చంద్రయాన్ కలలు కనే టెక్నాలజీ ప్రియుల కోసం రూపొందించిన ఈ స్మార్ట్ వాచ్ చూడటానికి స్టయిలిష్‌గా ఉంటుంది. ఇందులో ఉన్న యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, బ్లూటూత్ వంటి సెన్సర్లతో మీ రోజువారీ కదలికలను ట్రాక్ చేయవచ్చు. అయితే దీని అసలు ప్రత్యేకత వేరే! ఈ వాచ్‌ను మీకు నచ్చినట్టుగా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. కొత్త వాచ్ ఫేస్‌లు డిజైన్ చేయడం, చిన్న చిన్న ఆటలు తయారు చేయడం, మీ సొంత యాప్‌లను రూపొందించడం కూడా సాధ్యమే. టెక్నాలజీని సరదాగా నేర్చుకోవాలనుకునే పిల్లలకు, యువతకు ఇది ఒక మినీ లెర్నింగ్ ల్యాబ్‌లా పనిచేస్తుంది. ధర రూ. 10,700.
మాట్లాడే బుజ్జి రోబో! కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఆఫీస్ టేబుల్‌పై కూర్చుని పని చేస్తున్నప్పుడు మీతో కబుర్లు చెప్పే ఓ చిన్న ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది? అలాంటి ఫ్యూచరిస్టిక్ ఫన్ ను తీసుకొచ్చే గాడ్జెట్ ఇదే. ఏఐ వాయిస్ ఇంటరాక్షన్ కంపానియన్ రోబో! చూడటానికి చిన్న బొమ్మలా కనిపించినా, ఇందులో ఉన్న స్మార్ట్ వాయిస్ ఇంటరాక్షన్ ఫీచర్‌తో మీ మాటలకు స్పందిస్తూ సరదాగా ఇంటరాక్ట్ అవుతుంది. దీని చిన్న డిస్ప్లేలో కనిపించే క్యూట్ యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్స్ వల్ల ఇది నిజంగానే ఎమోషన్స్ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు మాట్లాడితే ఇది రియాక్ట్ అవుతూ, టేబుల్‌పై కూర్చున్న చిన్న డిజిటల్ పెట్లా ఫీల్ ఇస్తుంది. మాగ్నెటిక్ మౌంట్‌కు సపోర్ట్ ఉండటంతో కార్ డ్యాష్‌బోర్డ్‌పై సులభంగా అమర్చుకోవచ్చు. ధర రూ. 18,000.
మెడలోనే చిన్న ఏసీ, చిన్న హీటర్! వేçసవిలో ఎండలు మండిపోతుంటే ‘చల్లని గాలి తగిలితే బాగుండు!’ అనిపిస్తుందా? లేదా చలికాలంలో ‘కొంచెం వెచ్చదనం ఉంటే చాలు!’ అని కోరుకుంటున్నారా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ వేరబుల్ కూలింగ్–హీటింగ్ పరికరం!
ఇది కేవలం ఒక గాడ్జెట్ కాదు, మీ వ్యక్తిగత ఉష్ణోగ్రత నియంత్రణ సాధనం. మెడకు వేసుకునే పట్టీతో దీనిని మెడకు లేదా ఛాతీ దగ్గర ధరించవచ్చు. అవసరాన్ని బట్టి ఇందులో ఉన్న మూడు చల్లదనం స్థాయులు, మూడు వెచ్చదనం స్థాయులు ఎంచుకుని క్షణాల్లో మీకు కావాల్సిన సౌకర్యాన్ని పొందవచ్చు. ఇంట్లో, ఆఫీస్‌లో, ప్రయాణాల్లో లేదా బయట తిరిగేటప్పుడు కూడా ఇది మీతో పాటు ఉంటుంది. చిన్న సైజులో ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. స్టీల్, సిలికాన్ తో తయారైన దీన్ని శుభ్రం చేయడం కూడా చాలా సులువు. ధర రూ. 16,760.
ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)
కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21)
మూడు ముళ్ల బంధానికి పద్నాలుగేళ్లు..ముచ్చటగా ముగ్గురు పిల్లలు (ఫోటోలు)
తల్లికి ఎగనామం.. బిడ్డలకు పంగనామం.. చేతులెత్తేసిన చంద్రబాబు
వరంగల్ లో కీచక ఎస్సై.. నగ్న ఫోటోలు బయటపెడతానంటూ..