
రాజ్ ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా ‘మహారాష్ట్ర నవ్‌నిర్మాణ సేన’ టూ వీలర్ యజమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. లీటర్ పెట్రోల్‌పై 5 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. ఇంటర్నెట్ డెస్క్: రాజ్ ఠాక్రే పుట్టిన రోజు సందర్భంగా ‘మహారాష్ట్ర నవ్‌నిర్మాణ సేన’ టూ వీలర్ యజమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. లీటర్ పెట్రోల్‌పై 5 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. ఈ మేరకు ముంబై వ్యాప్తంగా ఎంఎన్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో రూ.5 డిస్కౌంట్ కూపన్లు పంచిపెట్టాయి. ఎంపిక చేసిన 36 పెట్రోల్ బంక్‌లలో కస్టమర్లు డిస్కౌంట్ కూపన్ ఇచ్చి లీటర్ పెట్రోల్‌పై 5 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. ఈ రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జనం కూపన్లు పట్టుకుని పెట్రోల్ బంకుల దగ్గరకు చేరుతున్నారు. కూపన్లు ఇచ్చి పెట్రోల్ పోయించుకుంటున్నారు. 5 రూపాయల డిస్కౌంట్ ఆఫర్‌పై ఎంఎన్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ జై శ్రింగార్పురే మాట్లాడుతూ.. ‘ పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా జనం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణ ప్రజలకు ఊరట కలిగించాలనే ఉద్దేశ్యంతో పార్టీ 5 రూపాయల డిస్కౌంట్ కూపన్లను పంచాలని నిర్ణయించింది. ప్రజలకు మా వంతు సాయం చేశాం’ అని తెలిపారు. ఎంఎన్ఎస్ శ్రేణులు కూపన్లు పంచి పెట్టిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘చాలా మంచి పని చేశారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముసుగు మహిళ ఎంట్రీ.. కాసేపటికే ఘోర అగ్నిప్రమాదం! సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు