
ప్రముఖ సినీ నటి గౌతమి తడిమల్లా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కేవలం సమాజ సేవా కార్యక్రమాల్లోనే మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2026 జూన్ 14న రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామికి తన అధికారిక రాజీనామా లేఖను పంపించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార రణరంగంలో ఆమె పార్టీ తరఫున అత్యంత కీలకమైన పాత్రను పోషించడమే కాకుండా చురుగ్గా పాల్గొన్నారు.రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన తర్వాత, అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ ప్రచార విభాగం డిప్యూటీ సెక్రటరీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు గౌతమి స్పష్టం చేశారు. కలిసి పనిచేసిన పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను అని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. నేను చాలా బరువెక్కిన హృదయంతో ఈ రోజు అన్నాడీఎంకేకు రాజీనామా చేశాను అని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వేలాది మంది అభిమానులతో పంచుకున్నారు.గౌతమి 29 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానందశాబ్దాల పాటు సినీ రంగంలో అగ్ర కథానాయికగా రాణించిన గౌతమి, ప్రజలకు సేవ చేయాలనే బలమైన సంకల్పంతో 1997లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ద్వారా క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి అగ్రనేత ఎల్.కే. అద్వానీ సమక్షంలో కండువా కప్పుకున్న ఆమె, సుమారు పాతికేళ్లకు పైగా ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారు. ఈ ప్రయాణంలో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు.ఆ తర్వాత 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమెకు పార్టీ పెద్దల
ప్రముఖ సినీ నటి గౌతమి తడిమల్లా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కేవలం సమాజ సేవా కార్యక్రమాల్లోనే మరింత చురుగ్గా పాల్గొనేందుకు వీలుగా ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2026 జూన్ 14న రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామికి తన అధికారిక రాజీనామా లేఖను పంపించారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార రణరంగంలో ఆమె పార్టీ తరఫున అత్యంత కీలకమైన పాత్రను పోషించడమే కాకుండా చురుగ్గా పాల్గొన్నారు.రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన తర్వాత, అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ ప్రచార విభాగం డిప్యూటీ సెక్రటరీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు గౌతమి స్పష్టం చేశారు. కలిసి పనిచేసిన పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను అని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. నేను చాలా బరువెక్కిన హృదయంతో ఈ రోజు అన్నాడీఎంకేకు రాజీనామా చేశాను అని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వేలాది మంది అభిమానులతో పంచుకున్నారు.గౌతమి 29 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానందశాబ్దాల పాటు సినీ రంగంలో అగ్ర కథానాయికగా రాణించిన గౌతమి, ప్రజలకు సేవ చేయాలనే బలమైన సంకల్పంతో 1997లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ద్వారా క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి అగ్రనేత ఎల్.కే. అద్వానీ సమక్షంలో కండువా కప్పుకున్న ఆమె, సుమారు పాతికేళ్లకు పైగా ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారు. ఈ ప్రయాణంలో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు.ఆ తర్వాత 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమెకు పార్టీ పెద్దల నుంచి కీలక బాధ్యతలు దక్కాయి. రాజపాళయం నియోజకవర్గ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా అప్పగించిన బాధ్యతలను ఆమె సమర్థంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేశారు. కాగా, సుమారు 25 ఏళ్ల ఈ సుదీర్ఘ అనుబంధానికి అక్టోబర్ 2023లో తెరపడింది. తన కష్టార్జితమైన సుమారు రూ. 25 కోట్ల విలువైన సుందర ఆస్తులను కాజేసిన ఒక మోసగాడికి కొందరు పార్టీ సీనియర్ నాయకులే మద్దతుగా నిలిచారని, పార్టీ నాయకత్వం కూడా తనకు ఎలాంటి న్యాయం చేయలేదనే మానసిక వేదనతో ఆమె బీజేపీ నుంచి బయటకు వచ్చారు.అన్నాడీఎంకేలో కీలక బాధ్యతలతో మెరిసిన నటిబీజేపీ సిద్ధాంతాలకు స్వస్తి పలికిన కొన్ని నెలల వ్యవధిలోనే, అంటే 2024 ఫిబ్రవరి 14న గౌతమి అన్నాడీఎంకే కండువా కప్పుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి సమక్షంలో పార్టీలోకి వచ్చిన ఆమెకు సాదర స్వాగతం లభించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితపై తనకు ఉన్న అపారమైన గౌరవంతో పాటు పళనిస్వామి సమర్థవంతమైన నాయకత్వంపై ఉన్న పూర్తి నమ్మకమే తన నిర్ణయానికి కారణమని ఆమె అప్పట్లో స్పష్టం చేశారు. ఆమె కష్టానికి తగిన ప్రతిఫలంగా అక్టోబర్ 21, 2024 న పార్టీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రచార విభాగం డిప్యూటీ సెక్రటరీగా నియమితులయ్యారు.కరియాశీల రాజకీయాలకు స్వస్తి పలికినప్పటికీ, గౌతమి ప్రజాసేవలో కొనసాగేందుకే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఆమె క్యాన్సర్‌ వ్యాధి బాధితులలో చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా పేద విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాస సాధనకు అవసరమైన సహాయం అందించేందుకు లైఫ్ అగైన్ ఫౌండేషన్ పేరిట ఒక స్వచ్ఛంద సామాజిక సంస్థను విజయవంతంగా నడుపుతున్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పగ్గాలు లేకుండా కేవలం ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలోనే మరింత మంది పేదలకు విసృతంగా ప్రజాసేవలు నిరంతరాయంగా అందించేలా ఆమె కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.