
మహారాష్ట్రలోని పండరీపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులను తీసుకెళ్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడిపోవడంతో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇంటర్నెట్ డెస్క్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని పండరీపూర్ సమీపంలో ఈరోజు (ఆదివారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులను తీసుకెళ్తున్న ఓ వ్యాన్ అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడిపోవడంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భక్తులు పండరీపూర్ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. బావిలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే 14 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మరికొందరి కోసం గాలింపు చర్యలుచేపట్టినల్లు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలు కష్టంగా మారినట్లు సమాచారం. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం ఎంతమంది ఉన్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనతో పండరీపూర్ ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. భక్తుల మృతి పట్ల స్థానికులు, అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ విజయంలో ఎయిర్ వారియర్స్ది కీలక పాత్ర: రాజ్నాథ్ సింగ్ వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం: మంత్రి సీతక్క ‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News