
మధ్యప్రదేశ్‌లోని హేతమ్‌పుర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. ఇంటర్నెట్ డెస్క్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌లోని హేతమ్‌పుర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈరోజు(ఆదివారం) ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వేపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖజురహో- ఉదయ్‌పూర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయని మొదటగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో భయంతో కొందరు ప్రయాణికులు చైన్ లాగారు. రైలు ఆగిపోయిన తర్వాత పలువురు ప్రయాణికులు హడావుడిగా కిందకు దిగి.. పక్కనున్న పట్టాలపైకి చేరుకున్నారు. అంతలోనే ఆ పట్టాలపై దూసుకొచ్చిన పాతాళ్ కోట్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొంది. ఈ ఘటనతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో గాయపడిన పలువురిని సమీప ఆస్పత్రులకు తరలించారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఘటనాస్థలంలో రైల్వేట్రాక్‌పై రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ప్రమాదంపై రైల్వేశాఖ విచారణ చేపట్టింది. మంటలు చెలరేగినట్లు వచ్చిన వార్తలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆపరేషన్ సిందూర్ విజయంలో ఎయిర్ వారియర్స్‌ది కీలక పాత్ర: రాజ్‌నాథ్ సింగ్ వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి వ్యతిరేకంగా లేఖ రాస్తాం: మంత్రి సీతక్క ‘సర్’ పేరుతో అసలైన ఓట్లను తొలగిస్తే ఊరుకోం.. కేటీఆర్ వార్నింగ్
Read Latest Telangana News And AP News And National News