
ఇంటర్నెట్ డెస్క్: హోమి అడజానియా దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor), తారలు కృతి సనన్ (Kriti Sanon), రష్మిక (Rashmika Mandanna) నటిస్తున్న చిత్రం ‘కాక్టెయిల్ 2’. మడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న మూవీ జూన్ 19న థియేటర్లలోకి రాబోతుంది (cocktail 2 release date). సినిమా ప్రచారాల్లో భాగంగా పుణెలో జరిగిన ఒక సంఘటన తాజాగా నెట్టింట వైరల్ అయింది. చిత్ర ప్రచారయాత్రలో భాగంగా ముగ్గురు నటీనటులు శనివారం పుణెలోని ఓ మాల్‌ను సందర్శించారు. వారిని చూసేందుకు అభిమానులు బారికేడ్లను దాటి రావడంతో తొక్కిసలాట వాతావరణం నెలకొంది. దీంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని కొద్దిసేపు నిలిపేశారు. ఈ గందరగోళంలో షాహిద్ అసహనానికి గురయ్యారు. భద్రతా సిబ్బంది వారిని బయటకు తీసుకెళ్తుండగా.. మరోవైపు కృతి మాత్రం రష్మికను అభిమానుల తాకిడి నుంచి తప్పించారు. ఆ దృశ్యాలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు కృతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె రష్మికను సోదరిలా కాపాడిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు, ఈ ఘటనపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నటీమణులకు భయానక అనుభవమని.. ప్రాంగణంలో నిర్వహణ లోపాలు, అభిమానుల తీరు బాగోలేదంటూ పోస్టులు పెట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.