
ఇంటర్నెట్ డెస్క్: బంగీ జంప్ (Bungee Jump) నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా 21 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బ్రెజిల్‌లోని లైమీరాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రేటర్ సావో పాలోకు చెందిన మరియా ఎడువార్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ (21) అడ్వెంచర్ గేమ్స్‌లో పాల్గొనడానికి శనివారం స్నేహితులతో కలిసి లైమీరా ప్రాంతానికి వెళ్లింది. బంగీ జంప్ చేయడానికి వంతెన వద్దకు వెళ్లిన యువతిని కిందకు వదిలేయడానికి ముందు అక్కడి సిబ్బంది ఆమె కాళ్లకు తాడును కట్టడం మర్చిపోయారు. ఆ విషయం గమనించుకోకుండా వారు మరియాను 40మీటర్ల ఎత్తైన వంతెన నుంచి కిందకు తోశారు. దీంతో కింద పడిన యువతి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. భద్రతా తాడును కట్టకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆమె మరణించినట్లు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ఆరుగురు సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇదీ చదవండి: లండన్‌లో భారతీయ యువకుడి హత్య గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.