
లడఖ్ అనగానే బైక్ రైడర్లు, పర్వత శ్రేణులు, అద్భుతమైన రహదారులు గుర్తుకువస్తాయి. కానీ, అదే లడఖ్‌లోని కఠినమైన కొండల మధ్య, ఒక నదీ లోయపై ఉన్న నిలువుటాకారపు కొండ అంచున భారతదేశంలోని అత్యంత అరుదైన ఆశ్రమం ఒకటి ఉంది. అదే 'ఫుగ్తాల్ మొనాస్టరీ' (Phugtal Monastery).
సాధారణ పర్యాటక ప్రాంతాల వలె మనం వాహనాలలో నేరుగా ఈ ఆశ్రమం వద్దకు వెళ్లలేము. ఎందుకంటే, ఇక్కడికి వెళ్లేందుకు ఎలాంటి ప్రత్యక్ష రహదారులు లేవు. ఇక్కడ షాపింగ్ మార్కెట్లు కానీ, మిమ్మల్ని బాహ్య ప్రపంచంతో ముడిపెట్టే మొబైల్ ఫోన్ సిగ్నల్స్ కానీ అస్సలు ఉండవు.
నిజమైన ప్రశాంతతను, సాహసాన్ని, శతాబ్దాలుగా మారని హిమాలయ జీవనశైలిని చూడాలనుకునే వారికి ఫుగ్తాల్ ఒక అద్భుతమైన వేదిక.లడఖ్‌లోని జన్స్కార్ (Zanskar) ప్రాంతంలో ఉన్న సుదూర లుంగ్నాక్ లోయలో ఫుగ్తాల్ మొనాస్టరీ ఉంది. సముద్ర మట్టానికి సుమారు 3,850 మీటర్ల ఎత్తులో, త్సారాప్ (Tsarap) నదికి పైభాగంలో ఉన్న ఒక సహజ గుహలో దీనిని నిర్మించారు.
ఈ పేరు వెనుక ఒక ప్రత్యేక అర్ధం ఉంది. ఇక్కడి స్థానిక భాషలో 'ఫుగ్' (Phug) అంటే గుహ అని, 'తాల్' (Tal) అంటే విముక్తి అని అర్థం. అంటే ఇది 'విముక్తిని ప్రసాదించే గుహ'. దీనిని దూరం నుంచి చూసినప్పుడు కొండపై నుంచి కిందకు జారిపడుతున్న ఒక భారీ తేనెతుట్టె (Honeycomb) వలె కనిపిస్తుంది.
బాహ్య ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉండటం వల్లే ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం నేటికీ చెక్కుచెదరకుండా ఉంది.అక్కడ రోడ్లు ఎందుకు లేవు?ఈ ఆశ్రమానికి