
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 లో సరికొత్త హిస్టరీ క్రియేట్ అయ్యింది. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అరుదైన, మొట్టమొదటి ఘటనకు ఈ మెగా టోర్నీ వేదికైంది. అమెరికా వెటరన్ డిఫెండర్ టిమ్ రీమ్ ఫిఫా వరల్డ్‌కప్ హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మ్యాచ్ రెఫరీ చేసిన ఒక తప్పుడు నిర్ణయం నుంచి వార్ (VAR - Video Assistant Referee) టెక్నాలజీ ద్వారా లబ్ధి పొందిన ప్రపంచపు మొట్టమొదటి ఆటగాడిగా టిమ్ రీమ్ రికార్డుకెక్కాడు. అసలు ఏం జరిగిందంటే? గ్రూప్ స్టేజ్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఒక ఫౌల్ జరిగింది. అయితే, ఆ ఫౌల్ చేసింది అమెరికాకు చెందిన వేరే ఆటగాడు అయినప్పటికీ.. మ్యాచ్ రెఫరీ పొరపాటున టిమ్ రీమ్కు ఎల్లో కార్డ్ చూపించాడు. ఫుట్‌బాల్ భాషలో దీనిని మిస్టేకెన్ ఐడెంటిటీ అంటారు. ఒకవేళ ఆ ఎల్లో కార్డ్ అలాగే ఉండి ఉంటే, అది మ్యాచ్ సమీకరణాలను, సదరు ఆటగాడి తదుపరి మ్యాచ్‌ల అవకాశాలను దెబ్బతీసేది. రెఫరీ తప్పుడు నిర్ణయాన్ని గమనించిన వీడియో అసిస్టెంట్ రెఫరీ బృందం వెంటనే రంగంలోకి దిగింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారిగా ఒక మిస్టేకెన్ ఐడెంటిటీ చెక్ కోసం వార్ టెక్నాలజీని ఉపయోగించారు. రీప్లేలను నిశితంగా పరిశీలించిన తర్వాత, ఫౌల్ చేసింది టిమ్ రీమ్ కాదని స్పష్టమైంది. దీనితో మైదానంలోని రెఫరీ తన తప్పును సరిదిద్దుకుని, టిమ్ రీమ్కు ఇచ్చిన ఎల్లో కార్డును రద్దు చేశారు. ఈ ఘటనతో టిమ్ రీమ్ అయాచితంగా హిస్టరీ బుక్స్‌లోకి ఎక్కాడు. వార్' టెక్నాలజీని కేవలం గోల్స్, రెడ్ కార్డ్స్ లేదా పెనాల్టీల కోసమే
కాకుండా.. ఇలాంటి తప్పుడు గుర్తింపులను సరిదిద్దడానికి ఉపయోగించి విజయం సాధించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ అరుదైన ఫుట్‌బాల్ రికార్డు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. క్రీడల్లో టెక్నాలజీ వాడకం ఎంత పారదర్శకతను తెస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని పలువురు కొనియాడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.