
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tuni Girl Missing Case Search Operation: దారి తప్పి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన బాలిక ఆచూకీ లభించలేదు. 9 రోజుల పాటు అటవీ ప్రాంతంలోనే బాలిక ఉండిపోయింది. బతికి ఉందో లేదో తెలియదు.. కానీ బతికి ఉంటుందనే ఆశతో పోలీసు బృందాలు.. ఇతర సహాయ బృందాలు అటవీ ప్రాంతాన్నీ జల్లెడ పడుతున్నాయి. నిర్విరామంగా వెతుకుతున్నా ఎంతకీ ఆచూకీ లభించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. బాలిక అదృశం కేసుపై ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి తొమ్మిది రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ, చిన్న ఆధారం కూడా లభించకపోవడం గమనార్హం. ఉన్న ఒక్కగానొక్క సాక్ష్యం.. కీలక ఆధారమైన పెంపుడు కుక్క చనిపోయింది. దీంతో బాలిక ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. బాలిక అదృశ్యం కేసును సవాల్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఎలాగైనా ఆచూకీ తెలుసుకోవాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు హోం మంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు మరికొన్ని బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు చేస్తుండడంతో కాకినాడ పోలీస్ యంత్రాంగం బాలిక కోసం వెతుకుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అటవీ శాఖ బృందాలను రంగంలోకి దింపాలని సూచించారు. మరోపక్క హోంమంత్రి అనిత ఎస్పీతో మాట్లాడి. కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపాలని ఆదేశించడంతో వారు పాప
కోసం వెతుకుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ ఏమైనా కనుగొంటుందా అని తల్లిదండ్రులతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
హోంమంత్రి సమీక్ష తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా ఎస్పీతో హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతున్నారు. నిరంతరం సమీక్ష చేస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి రోజు బాలిక అదృశ్యం కేసు వివరాలపై ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఆరా తీస్తున్నారు. హోం మంత్రి అనిత ఆదేశాలతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు దిగాయి. ఆదివారం కూడా హోంమంత్రి అనిత అధికారులకు పలు సూచనలు చేశారు. 'చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. ఈ కేసులో అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు' అని హోం మంత్రి అనిత వివరించారు.
తీవ్ర అనుమానాలు ఈనెల 9వ తేదీన బాలిక అదృశ్యమైన విషయం తెలిసిందే. పెంపుడు కుక్కతోపాటు బాలిక అటవీ ప్రాంతంలోకి వెళ్లి కనిపించకుండాపోయింది. మూడు రోజుల అనంతరం పెంపుడు కుక్క బయటకు రాగా.. బాలిక మాత్రం ఇంతవరకు ఆచూకీ లభించలేదు. బాలికను ఎవరైనా అపహరించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికను అపహరించి.. హత్య చేసి ఉంటారా? లేదా అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని అనే అనుమానాలు వస్తున్నాయి. కరాటే కల్యాణి ఎంట్రీ ఇచ్చి.. 'బాలికను అమావాస్య రోజు నర బలి ఇచ్చి ఉంటారు' అని వ్యాఖ్యానించడంతో బాలిక అదృశ్యం కేసు తీవ్ర సంచలనం రేపుతోంది.