
ఇంటర్నెట్ డెస్క్: ఫిపా ప్రపంచ కప్ 2026లో ఒక్కో మ్యాచ్ ఫలితం ఒక్కో రికార్డు నమోదు చేసేలా ఉంది. విజయాల కోసం ఎదురు చూస్తున్న జట్లు ఆ లోటును తీర్చుకుంటున్నాయి. తాజాగా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో స్కాట్లాండ్ బోణీ కొట్టింది. తమ తొలి మ్యాచ్‌లోనే హైతీపై 1-0 తేడాతో స్కాట్లాండ్ గెలిచింది. దీంతో 36 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ స్కాట్లాండ్ ప్రపంచకప్‌లో విజయం నమోదు చేసింది. చివరిసారిగా 1990లో స్వీడన్‌పై 2-1 తేడాతో స్కాట్లాండ్ విక్టరీ సాధించడం గమనార్హం. ఇక 1998 తర్వాత మేజర్ ఈవెంట్లలో గెలవడం కూడా ఇప్పుడే. బలాల ప్రకారం.. స్కాట్లాండ్, హైతీ జట్లకు పెద్ద తేడా ఏమీ లేదు. అయితే, స్కాట్లాండ్ ప్లేయర్ జాన్ మెక్గిన్ 28వ నిమిషంలో గోల్ కొట్టి తమ టీమ్‌కు ఆధిక్యం అందించాడు. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్ అదే. దాదాపు 13 సార్లు గోల్ కోసం హైతీ ప్రయత్నించినా.. స్కాట్లాండ్ డిఫెండ్ ముందు వర్కౌట్ కాలేదు. మరోవైపు స్కాట్లాండ్ కేవలం 8 సార్లు మాత్రమే గోల్ కోసం టార్గెట్ చేసి ఒక సారి విజయం సాధించింది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.