
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ బి పోరులో శనివారం నరాలు తెగే ఉత్కంఠ భరిత మ్యాచ్ నమోదు అయ్యింది. బలమైన స్విట్జర్లాండ్ జట్టును పసికూన ఖతార్ ధీటుగా ఎదుర్కొంది. దీంతో మ్యాచ్‌ను 1-1 తో డ్రాగా ముగించేసింది. ఇరు జట్లు కూడా చెరో గోల్ కొట్టడంతో పాయింట్లు షేర్ చేసుకున్నాయి. ఈ డ్రాతో ఖతార్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ హిస్టరీ లోనే సరికొత్త అధ్యాయాన్ని లిక్కించిందని చెప్పవచ్చు. వరల్డ్ కప్ హిస్టరీ లోనే ఖతార్ కు ఇదే మొట్టమొదటి పాయింట్ కావడం విశేషం అని చెప్పాలి. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే స్విట్జర్లాండ్ ఆటగాళ్లు మైదానంలో తమ ఆధిపత్యాన్ని చెలాయించారు. ఆట 17వ నిమిషంలో స్విస్ జట్టుకు లభించిన పెనాల్టీ ఛాన్స్ ను ఆ జట్టు స్టార్ ప్లేయర్ బ్రిల్ ఎంబోలో అద్భుతంగా మలుచుకున్నాడు. ఎలాంటి తప్పు చేయకుండా బంతిని ఈజీగా గోల్ పోస్ట్ లోకి పంపించి స్విస్ 1-0 ఆధిక్యతంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కూడా స్విస్ ఆటగాళ్లు పలుమార్లు ఖతార్ గోల్ పోస్ట్ పై దాడులు చేసినప్పటికీ.. రెండో గోల్ సాధించడంలో విఫలమయ్యారని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో కూడా స్విట్జర్లాండ్ బలంగా ఉండటంతో ఖతార్ ఈ మ్యాచ్ పై ఆశలు వదిలేసుకున్నట్లే కనిపించింది. అయితే కొన్ని క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుంది అనగా అదనపు సమయంలో ఖతార్ ప్లేయర్ ఒక అద్భుతం చేశాడు. తోటి ఆటగాడు హోమమ్ ఎల్ అమిన్ అందించిన సూపర్ క్రాస్ ను ఖౌఖీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడర్ ద్వారా గోల్ గా మలిచాడు. దాంతో స్కోర్ 1-1 తో సమం అయ్యింది. ఊహించని ఈ గోల్‌తో స్టేడియంలోని ఖతర్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఆ వెంటనే అదనపు సమయం ముగియడంతో మ్యాచ్ చివరికి డ్రాగా ముగిసింది. కేవలం 4 సార్లు మాత్రమే టార్గెట్ వైపు షాట్స్
కొట్టిన ఖతార్ చివరి నిమిషంలో లభించిన ఛాన్స్ ను గోల్ గా మార్చుకొని చారిత్రాత్మక పాయింట్లు తన అకౌంట్లో వేసుకుంది .