
సలార్ పార్ట్ 1 సీజ్ఫైర్, మిరాయ్, మ్యూజిక్ స్కూల్, గుడ్ బ్యాడ్ అగ్లీ, మట్కా.. మొదలైన సినిమాలతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ‘కార్తికేయ్ దేవ్.’ ‘పిల్లల ఆసక్తిని గమనించి, తగిన సూచనలతో గైడ్ చేయడం వరకే ఈ తరాన్ని పెంచడం అంటే’ అని వివరించారు కార్తికేయ దేవ్ తల్లి కవిత పొదిలపు, తండ్రి గద్దె నారాయణరావు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఈ తల్లిదండ్రులు తమ కూతురు పునర్విక, కొడుకు కార్తికేయదేవ్ పెంపకం గురించి పంచుకున్న విశేషాలు... ‘‘మేమిద్దరం సాఫ్ట్వేర్ ఉద్యోగులమే. పిల్లలు కూడా సాఫ్ట్వేర్ రంగంలోనే ఉండాలని అనుకోవడంలేదు. బాబుకు ఊహ తెలిసినప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టముండేది. ఎవరైనా ‘పెద్దయ్యాక ఏం అవుతావు?’ అని అడిగితే, ‘హీరో అవుతా’ అనేవాడు. టీవీ ముందు నిలుచొని, ‘అమ్మా, టీవీ లోపలికి వెళ్తా...’ అనేవాడు. చదువులో కూడా ముందుండేవాడు. కొన్ని రోజులు ఆలోచించాను. ‘బాబు యాక్టింగ్ అంటే ఆసక్తి చూపుతున్నాడు, ఒకసారి ప్రయత్నిద్దాం’ అని ఇంటర్నెట్లో వెతికి ఒక మోడలింగ్ స్కూల్లో చేర్పించాం. డిస్టెన్స్ వద్దని చెబుతాను.. మొదట ఒకట్రెండు యాడ్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేశాడు. ఆ సమయంలోనే చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. ఒక రోజు ఇంట్లో అందరం కూర్చొని ఈ విషయమ్మీద చర్చపెట్టుకున్నాం. ‘‘మనకు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. అక్కడ పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది. సినిమాలు హిట్, ప్లాపులుంటాయి. ఎక్కడైనా డౌన్ అయితే డిప్రెస్ అయ్యే సందర్భాలూ ఉంటాయి. మేం ఎప్పుడూ నీ వెంటే ఉండకపోవచ్చు. బ్యాలెన్స్ చేసుకోకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. చదువుపైన ఎంత ఫోకస్ పెడితే అంత ప్రోత్సహిస్తాం’’ అని చెప్పాం. బాబు మాత్రం ‘సినిమాయే నా కెరీర్’ అన్నాడు. దీంతో బాబుకి ఇష్టమైన కెరీర్వైపే అడుగులు వేయడం మంచిదనుకున్నాం. ఇష్టమైన వాటికోసం పరుగులు తీస్తూ, చదువుని నిర్లక్ష్యం చేయకూడదని, ‘డిగ్రీ తప్పనిసరిగా ఉండాల’ని చెప్పాను. అందుకు ‘సరే’ అన్నాడు
Jun 14 2026 7:55 AM | Updated on Jun 14 2026 7:55 AM
సలార్ పార్ట్ 1 సీజ్ఫైర్, మిరాయ్, మ్యూజిక్ స్కూల్, గుడ్ బ్యాడ్ అగ్లీ, మట్కా.. మొదలైన సినిమాలతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ‘కార్తికేయ్ దేవ్.’ ‘పిల్లల ఆసక్తిని గమనించి, తగిన సూచనలతో గైడ్ చేయడం వరకే ఈ తరాన్ని పెంచడం అంటే’ అని వివరించారు కార్తికేయ దేవ్ తల్లి కవిత పొదిలపు, తండ్రి గద్దె నారాయణరావు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఈ తల్లిదండ్రులు తమ కూతురు పునర్విక, కొడుకు కార్తికేయదేవ్ పెంపకం గురించి పంచుకున్న విశేషాలు...
‘‘మేమిద్దరం సాఫ్ట్వేర్ ఉద్యోగులమే. పిల్లలు కూడా సాఫ్ట్వేర్ రంగంలోనే ఉండాలని అనుకోవడంలేదు. బాబుకు ఊహ తెలిసినప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టముండేది. ఎవరైనా ‘పెద్దయ్యాక ఏం అవుతావు?’ అని అడిగితే, ‘హీరో అవుతా’ అనేవాడు. టీవీ ముందు నిలుచొని, ‘అమ్మా, టీవీ లోపలికి వెళ్తా...’ అనేవాడు. చదువులో కూడా ముందుండేవాడు. కొన్ని రోజులు ఆలోచించాను. ‘బాబు యాక్టింగ్ అంటే ఆసక్తి చూపుతున్నాడు, ఒకసారి ప్రయత్నిద్దాం’ అని ఇంటర్నెట్లో వెతికి ఒక మోడలింగ్ స్కూల్లో చేర్పించాం.
డిస్టెన్స్ వద్దని చెబుతాను.. మొదట ఒకట్రెండు యాడ్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేశాడు. ఆ సమయంలోనే చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. ఒక రోజు ఇంట్లో అందరం కూర్చొని ఈ విషయమ్మీద చర్చపెట్టుకున్నాం. ‘‘మనకు ఇండస్ట్రీలో ఎవరూ లేరు. అక్కడ పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుంది. సినిమాలు హిట్, ప్లాపులుంటాయి. ఎక్కడైనా డౌన్ అయితే డిప్రెస్ అయ్యే సందర్భాలూ ఉంటాయి.
మేం ఎప్పుడూ నీ వెంటే ఉండకపోవచ్చు. బ్యాలెన్స్ చేసుకోకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది. చదువుపైన ఎంత ఫోకస్ పెడితే అంత ప్రోత్సహిస్తాం’’ అని చెప్పాం. బాబు మాత్రం ‘సినిమాయే నా కెరీర్’ అన్నాడు. దీంతో బాబుకి ఇష్టమైన కెరీర్వైపే అడుగులు వేయడం మంచిదనుకున్నాం. ఇష్టమైన వాటికోసం పరుగులు తీస్తూ, చదువుని నిర్లక్ష్యం చేయకూడదని, ‘డిగ్రీ తప్పనిసరిగా ఉండాల’ని చెప్పాను. అందుకు ‘సరే’ అన్నాడు.
చదువు, కెరీర్ మాత్రమే కాదు, జీవితంలో రిలేషన్స్ కూడా అంతే ముఖ్యమని డిస్టెన్స్ ఉండవద్దని చెబుతుంటాను. పుట్టింటివైపు, అత్తింటివైపు బంధుత్వాలను కవర్ చేస్తూ, వరసల గురించి వివరిస్తాను. మామూలుగా కూడా ఆంటీ, అంకుల్ అని కాకుండా చిన్నమ్మ, అత్తయ్య, బాబాయ్, మామయ్య.. అని పిలిపిస్తాను. మమ్మల్ని కూడా పిల్లలు ‘అమ్మ నాన్న’ అనే పిలుస్తారు.
అవసరమైనదే కొనాలి పిల్లలు ఎదిగే క్రమంలో ఆర్థిక విషయాల్లో అవగాహన ఉండాలి. సినిమా రంగం కాబట్టి మంచి బ్రాండెడ్ డ్రెస్సులు, ఇతర యాక్ససరీస్ అవసరం. అలాగని అధిక ఖర్చులు ఎందుకు అనవసరమో చెబుతాను. తనకు ఒక డిజిటల్ కార్డ్ ఇచ్చాను. దాని ఉపయోగం ఎంతవరకో వివరించాను. పునర్వికకు కూడా ఇదే విషయాన్ని చెబుతాను. మావారిది నైట్ షిఫ్ట్. పగలు విశ్రాంతి తీసుకోవాలి. తనకు అంత ఒత్తిడి ఇవ్వకూడదు అనుకుంటాను. కానీ, తను కూడా పిల్లల కోసం టైమ్ కేటాయిస్తాడు. ‘ఈ హీరో యాక్షన్నను ఇలా ఉంది, నీకు ఇది ఎలా యాప్ట్ అవుతుందో చూడు’ అని చెబుతుంటారు.
దాపరికాలు ఉండకూడదు ఇప్పటి పిల్లలకు చాలా ఎంపికలు ఉన్నాయి. ఎటుగా వెళితే మంచిది అని కూడా బాగా ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు ‘మా అమ్మనాన్నలు మాకు ఇష్టమైనది చేయనివ్వడం లేదు’ అనిపిస్తే చికాకు చూపుతారు. పిల్లలిద్దరిదీ టీనేజ్ వయసు. పిల్లలకు మాతో పంచుకునే సందర్భాలు ఎక్కువ ఉండేలా, దాపరికాలు లేకుండా చూసుకుంటాను. డిజిటల్ ప్రపంచం ఈ తరానికి ఎంత మక్కువో తెలిసిందే.
అందుకే, బయట ఫ్రెండ్స్‌తో వెళ్లమని చెబుతాను. పాప కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటోంది. ఇంటీరియర్, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రస్ట్ చూపుతోంది. పెద్దయ్యాక తన ఇంట్రస్ట్ బేస్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. నా వరకైతే పిల్లల ఆసక్తిని చూసి ఆ దిశగా తీసుకెళ్లడమే మంచిది. పెద్దలుగా మన ఇష్టాలను వారి మీద రుద్దకూడదు. వాళ్ల కోసం వాళ్లకు న చ్చిన వర్క్ చేస్తేనే సంతోషంగా ఎదుగుతారు’’ అని వివరించారు ఈ టీనేజ్ యాక్టర్ అమ్మనాన్న.
ఒత్తిడి తగదు ఒక్కసారి కూడా స్కూల్‌కి వెళ్లి ర్యాంకులు, గ్రేడ్లు ఎలా వస్తున్నాయి అని చూడను. ఎప్పుడైనా ఒకసారి పేరెంట్ టీచర్ మీటింగ్‌కు వెళతాను. మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు సరిగా చూసుకోవాలి అని చెబుతాను తప్ప, కోపం చూపను. మా అమ్మనాన్నలు కూడా మా చదువు విషయంలో ఒత్తిడి తీసుకురాలేదు.
‘మీరు ఎంత వరకు అంటే అంతవరకు చదివిస్తాను’ అనేవారు మా నాన్న. నేను కూడా పిల్లలతో అదే అంటాను. ఇన్ని డబ్బులు పెడుతున్నాం, ఇవేనా మార్కులు’ అని ఎప్పుడూ అన్నది లేదు. నిర్మలారెడ్డి
(చదవండి: లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన ఆహారం సురక్షితమేనా? పాపం ఆ నవ వధువు..)
ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫొటోలు)
పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్ (ఫొటోలు)
‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
నందూస్ స్కాం మిస్టరీ..! బయటపడుతున్న కీలక సీక్రెట్స్
చంద్రబాబు పేరుతో వీడియో కాల్ AI టెక్నాలజీతో కేటుగాళ్ల మోసం
మెగా.. దగా.. బాబుకి హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య
ఆంత్రోపిక్ కు అమెరికా బిగ్ షాక్..ఫేబుల్ 5, మైథోస్ 5 బంద్