
మన శరీరంలో కొన్ని అవయవాలు పరిమాణంలో చిన్నవైనా, వాటి పని మాత్రం అసాధారణంగా ఉంటుంది. అలాంటి వాటిల్లో అడ్రినల్ గ్రంథులు ఒకటి. ప్రతి అడ్రినల్ గ్రంథి సుమారు 4–6 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఆకారంలో చిన్న త్రిభుజంలా కనిపించే ఈ గ్రంథులు ఒక్కో కిడ్నీపైన ఒక్కటి ఉంటాయి. జీవక్రియలకు అత్యవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే శక్తిమంతమైన గ్రంథులివి. ఈ అడ్రినల్ గ్రంథి చేసే అద్భుతమైన పనులేమిటో తెలుసుకుందాం. చాలా మందికి అడ్రినల్ గ్రంథుల గురించి పెద్దగా తెలియదు. కానీ ప్రతి రోజు మన శరీరంలో జరిగే అనేక ముఖ్యమైన ప్రక్రియలను ఇవే నియంత్రిస్తాయి. ఒత్తిడి సమయంలో అడ్రినల్ గ్రంథుల పాత్ర మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో అడ్రినల్ గ్రంథులు వెంటనే స్పందిస్తాయి. ఈ సమయంలో అడ్రినలిన్ విడుదల అవుతుంది. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకోవడం రక్తపోటు పెరగడం శరీరానికి తక్షణ శక్తి అందించడం మెదడు అప్రమత్తంగా మారడం జరుగుతుంది. ఇలా జరగడాన్ని వైద్యపరంగా ‘ఫైట్ లైదా ఫ్లైట్ రెస్పాన్స్’ అంటారు. అంటే ప్రమాదాన్ని ఎదుర్కొని పోరాడటానికీ లేదా ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి శరీరం సిద్ధమవుతుంది. కార్టిసోల్ అంటే ఏమిటి... ఎందుకు అవసరం? కార్టిసోల్ను చాలామంది ‘స్ట్రెస్ హార్మోన్’ అని పిలుస్తారు. కానీ ఇది కేవలం ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ మాత్రమే కాదు. ఇది... శక్తి వినియోగం వంటి అనేక ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఆల్డోస్టెరోన్ పని ఏమిటి? ఆల్డోస్టెరోన్ శరీరంలో సోడియం, పొటాషియంలతోపాటు నీటి సమతుల్యతను నియంత్రిస్తుంది. దీని ద్వారా రక్త΄ోటు నియంత్రణ జరుగుతుంది. కొంతమందిలో ఆల్డోస్టెరోన్ అధికంగా తయారవుతుంది. దీనిని ‘ప్రైమరీ హైపర్ ఆల్డోస్టెరోనిజం’ అంటారు. ఇది అధిక రక్త΄ోటుకు ఒక ముఖ్యమైన కారణం. కానీ... దీన్ని గుర్తించడం కష్టం. ముఖ్యంగా చిన్న వయసులోనే తీవ్రమైన బీపీ రావడం, మూడు నాలుగు మందులతో కూడా బీపీ నియంత్రణలోకి రాక΄ోవడం, రక్తంలో పొటాషియం తగ్గిపోవడం వంటి పరిస్థితుల్లో
Jun 14 2026 8:17 AM | Updated on Jun 14 2026 8:17 AM
మన శరీరంలో కొన్ని అవయవాలు పరిమాణంలో చిన్నవైనా, వాటి పని మాత్రం అసాధారణంగా ఉంటుంది. అలాంటి వాటిల్లో అడ్రినల్ గ్రంథులు ఒకటి. ప్రతి అడ్రినల్ గ్రంథి సుమారు 4–6 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఆకారంలో చిన్న త్రిభుజంలా కనిపించే ఈ గ్రంథులు ఒక్కో కిడ్నీపైన ఒక్కటి ఉంటాయి. జీవక్రియలకు అత్యవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే శక్తిమంతమైన గ్రంథులివి. ఈ అడ్రినల్ గ్రంథి చేసే అద్భుతమైన పనులేమిటో తెలుసుకుందాం.
చాలా మందికి అడ్రినల్ గ్రంథుల గురించి పెద్దగా తెలియదు. కానీ ప్రతి రోజు మన శరీరంలో జరిగే అనేక ముఖ్యమైన ప్రక్రియలను ఇవే నియంత్రిస్తాయి.
ఒత్తిడి సమయంలో అడ్రినల్ గ్రంథుల పాత్ర మనిషి ప్రమాదంలో ఉన్నప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో అడ్రినల్ గ్రంథులు వెంటనే స్పందిస్తాయి. ఈ సమయంలో అడ్రినలిన్ విడుదల అవుతుంది. ఫలితంగా
గుండె వేగంగా కొట్టుకోవడం రక్తపోటు పెరగడం శరీరానికి తక్షణ శక్తి అందించడం
మెదడు అప్రమత్తంగా మారడం జరుగుతుంది. ఇలా జరగడాన్ని వైద్యపరంగా ‘ఫైట్ లైదా ఫ్లైట్ రెస్పాన్స్’ అంటారు. అంటే ప్రమాదాన్ని ఎదుర్కొని పోరాడటానికీ లేదా ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి శరీరం సిద్ధమవుతుంది.
కార్టిసోల్ అంటే ఏమిటి... ఎందుకు అవసరం? కార్టిసోల్ను చాలామంది ‘స్ట్రెస్ హార్మోన్’ అని పిలుస్తారు. కానీ ఇది కేవలం ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ మాత్రమే కాదు. ఇది...
శక్తి వినియోగం వంటి అనేక ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది.
ఆల్డోస్టెరోన్ పని ఏమిటి? ఆల్డోస్టెరోన్ శరీరంలో సోడియం, పొటాషియంలతోపాటు నీటి సమతుల్యతను నియంత్రిస్తుంది. దీని ద్వారా రక్త΄ోటు నియంత్రణ జరుగుతుంది. కొంతమందిలో ఆల్డోస్టెరోన్ అధికంగా తయారవుతుంది. దీనిని ‘ప్రైమరీ హైపర్ ఆల్డోస్టెరోనిజం’ అంటారు. ఇది అధిక రక్త΄ోటుకు ఒక ముఖ్యమైన కారణం. కానీ... దీన్ని గుర్తించడం కష్టం.
ముఖ్యంగా చిన్న వయసులోనే తీవ్రమైన బీపీ రావడం, మూడు నాలుగు మందులతో కూడా బీపీ నియంత్రణలోకి రాక΄ోవడం, రక్తంలో పొటాషియం తగ్గిపోవడం వంటి పరిస్థితుల్లో ఈ వ్యాధిని అనుమానించాలి. సరైన పరీక్షలతో దీన్ని గుర్తించి చికిత్స చేస్తే బీపీని గణనీయంగా నియంత్రించవచ్చు.
అడ్రినల్ గ్రంథి ఆరోగ్యానికి చేయాల్సిందేమిటి...?
ఇవి అవసరం. చివరిగా... అడ్రినల్ గ్రంథులు పరిమాణంలో చిన్నవైనా, జీవానికి అత్యంత కీలకమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే శక్తివంతమైన గ్రంథులు. శరీర సమతుల్యతను కాపాడడంలో ఇవి చేసే పని అసాధారణం. అందుకే శరీర సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా, అవసరమైతే ఎండోక్రైనాలజిస్ట్ను సంప్రదించడం మంచిది.
డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి,సీనియర్ ఎండోక్రైనాలజిస్ట్,
ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫొటోలు)
పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్ (ఫొటోలు)
‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
నందూస్ స్కాం మిస్టరీ..! బయటపడుతున్న కీలక సీక్రెట్స్
చంద్రబాబు పేరుతో వీడియో కాల్ AI టెక్నాలజీతో కేటుగాళ్ల మోసం
మెగా.. దగా.. బాబుకి హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య