
ఎస్ఎస్డీ టోకెన్లకు క్యూలైన్లోకి ప్రవేశించడమే మహా ప్రహసనం తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో ఎస్ఎస్డీ టోకెన్ల కోసం క్యూలైన్లో ప్రవేశించడానికి భక్తుల తోపులాట ఈనాడు, ఈనాడు డిజిటల్, తిరుపతి: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్లు తీసుకునేందుకు క్యూలైన్లోకి ప్రవేశించాలంటే.. పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది.
అక్కడ తరచూ తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఊపిరాడక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు, సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. శనివారం సర్వదర్శనం క్యూలైన్ ఐదు కిలోమీటర్ల మేర పెరిగింది. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని తితిదే ప్రకటించింది.
శ్రీవారిని శుక్రవారం 74,636 మంది దర్శించుకున్నారు. తిరుమల వెళ్లే వాహనాల రద్దీతో శనివారం అలిపిరి వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనాల్లోనే గంటల తరబడి చిక్కుకుని భక్తులు ఇబ్బందులు పడ్డారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.