
లండన్‌లోని ఇల్ఫోర్డ్ హైరోడ్డులో ఒక అద్భుతం జరిగింది. మృత్యువుతో పోరాడుతున్న ఒక చిన్నారికి భారతీయుడు పునర్జన్మనిచ్చాడు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నెట్ డెస్క్: లండన్‌లోని ఇల్ఫోర్డ్ హైరోడ్డులో గుండెల్ని పిండేసే ఓ ప్రమాదం తృటిలో తప్పింది. భవనం పైనుంచి కిందపడిపోతున్న మూడేళ్ల చిన్నారిని, ఒక భారతీయ యువకుడు, పోలీస్ కానిస్టేబుల్‌తో కలిసి అద్భుతంగా క్యాచ్ పట్టి ప్రాణాలు కాపాడిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇల్ఫోర్డ్లోని ఓ పాన్‌బ్రోకర్ షాప్ పైనున్న ఫ్లాట్ కిటికీ వద్దకు ఒక మూడేళ్ల చిన్నారి ఎలాగోలా చేరుకుంది. అక్కడ ఒక్కసారిగా పట్టుతప్పి ఆ కిటికీ అంచును పట్టుకుని ప్రాణభయంతో వేలాడుతూ కనిపించింది. ఈ భయానక దృశ్యాన్ని చూసిన కింద ఉన్న జనం తీవ్ర ఆందోళనతో కేకలు వేయడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ, ఆ చిన్నారిని అందుకోవడానికి ఇబ్బంది పడ్డారు. సరిగ్గా అదే సమయంలో అక్కడే నివసిస్తున్న భారతీయుడు మహ్మద్ జెసిల్ ఆ దృశ్యాన్ని చూశాడు. ఏమాత్రం ఆలోచించకుండా బిల్డింగ్ పైకి పరుగెత్తాడు. ఆ చిన్నారి చేతి పట్టు సడలిపోతూ కిందకు జారిపోతున్న క్షణంలో.. జెసిల్, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. సరిగ్గా ఆ చిన్నారి కింద పొజిషన్ తీసుకుని, పైనుంచి పడిపోతున్న పాపను జాగ్రత్తగా క్యాచ్ పట్టుకున్నారు. అదే సమయంలో పక్కనే ఉన్న మరో పోలీస్ ఆఫీసర్ వారిద్దరూ కిందపడకుండా బ్యాలెన్స్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భారతీయ యువకుడు మహ్మద్ జెసిల్ చాకచక్యాన్ని, బ్రిటన్ పోలీసుల సమయస్ఫూర్తిని నెటిజన్లు రియల్ హీరోలంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాకిస్థాన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే.. ఇరాన్‌ను తక్షణమే వీడండి.. భారతీయులకు సూచన
..