
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Heavy Rains In Several Districts Of Telangana: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు భీకర గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రజలు వర్షాలు, ఈదురుగాలుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ ప్రాంతాల మీదుగా విస్తరించాయని.. మరో రెండు రోజుల్లో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌లోని మరిన్ని ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఇవాళ, రేపు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో.. ప్రజలు బయటకు రావొద్దని.. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భీకర గాలులతో కూడిన
వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి జిల్లా రేపల్లిలో 7.3 సెంటీ మీటరర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా వర్షాల కురవగా.. మెదక్, వికారాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో కూడా గణనీయమైన వర్షపాతం నమోదైంది. మరోవైపు కరీంనగర్ జిల్లాలో గాలివాన అల్లకల్లోలం సృష్టించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.