
ఫిఫా ప్రపంచకప్-2026లో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా ఖతార్-స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఖతార్‌కు ఇదే తొలి పాయింట్ కావడం విశేషం. కాగా ఈ మ్యాచ్ ఆరంభం నుంచే స్విట్జర్లాండ్ జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. 17వ నిమిషంలో ఖతార్ గోల్‌కీపర్ మహమూద్ అబునాడ ప్రత్యర్థి ఆటగాడిని ఫౌల్ చేయడంతో స్విట్జర్లాండ్‌కు పెనాల్టీ లభించింది. దీనిని బ్రీల్ ఎంబోలో విజయవంతంగా గోల్‌గా మలిచి స్విట్జర్లాండ్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత స్విస్ డిఫెండర్లు అప్రమత్తంగా ఉండడంతో ఖతార్ కనీసం గోల్ పోస్ట్ వైపు కూడా సంధించలేకపోయింది. దీంతో ఖతార్ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ మ్యాచ్ ముగుస్తుందన్న ఆఖరి క్షణాల్లో ఖతార్ కెప్టెన్ బౌలెం ఖౌఖీ అద్భుతం చేశాడు. బౌలెం ఖౌఖీ అత్యంత చాకచక్యంగా హెడర్ ద్వారా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దీంతో స్టేడియంలో ఖతార్ ఆటగాళ్లు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చదవండి: శుబ్‌మన్ గిల్ గెలిపించగా... ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫొటోలు) పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్ (ఫొటోలు) ‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) 'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు) మెగా.. దగా.. బాబుకి హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య ఆంత్రోపిక్ కు అమెరికా బిగ్ షాక్..ఫేబుల్ 5, మైథోస్ 5 బంద్
Jun 14 2026 7:19 AM | Updated on Jun 14 2026 7:23 AM
ఫిఫా ప్రపంచకప్-2026లో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కో వేదికగా ఖతార్-స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో ఖతార్‌కు ఇదే తొలి పాయింట్ కావడం విశేషం. కాగా ఈ మ్యాచ్ ఆరంభం నుంచే స్విట్జర్లాండ్ జట్టు పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది.
17వ నిమిషంలో ఖతార్ గోల్‌కీపర్ మహమూద్ అబునాడ ప్రత్యర్థి ఆటగాడిని ఫౌల్ చేయడంతో స్విట్జర్లాండ్‌కు పెనాల్టీ లభించింది. దీనిని బ్రీల్ ఎంబోలో విజయవంతంగా గోల్‌గా మలిచి స్విట్జర్లాండ్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత స్విస్ డిఫెండర్లు అప్రమత్తంగా ఉండడంతో ఖతార్ కనీసం గోల్ పోస్ట్ వైపు కూడా సంధించలేకపోయింది.
దీంతో ఖతార్ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ మ్యాచ్ ముగుస్తుందన్న ఆఖరి క్షణాల్లో ఖతార్ కెప్టెన్ బౌలెం ఖౌఖీ అద్భుతం చేశాడు. బౌలెం ఖౌఖీ అత్యంత చాకచక్యంగా హెడర్ ద్వారా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దీంతో స్టేడియంలో ఖతార్ ఆటగాళ్లు, అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చదవండి: శుబ్‌మన్ గిల్ గెలిపించగా...
ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫొటోలు)
పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్ (ఫొటోలు)
‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
మెగా.. దగా.. బాబుకి హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య
ఆంత్రోపిక్ కు అమెరికా బిగ్ షాక్..ఫేబుల్ 5, మైథోస్ 5 బంద్