
parvathapur critical mineral block in sangareddy: సంగారెడ్డి జిల్లా పర్వత పూర్ ప్రాంతంలో అద్భుతమైన ఖనిజ సంపద ఉన్నట్లు జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. సుమారు 15.25 మిలియన్ వెనేడియం, 87 మిలియన్ టన్నుల అల్యూమినియస్ లాటరైట్ నిక్షేపాలు ఇక్కడ లభించాయి. జహీరాబాద్ కు అతి సమీపంలో ఉన్న ఈ బ్లాక్ ద్వారా భారీ స్థాయిలో ఆదాయం రానుంది. అయితే ఈ గనులను ఎంఎల్‌సి ఇండియా లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థ. ఈ గనులకు ప్రాధాన్య బిడ్డరుగా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ తమను ప్రకటించింది అంటూ నేషనల్ స్టాఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాకు ఈ సంస్థ సమాచారం అందించింది. అయితే ఈ అరుదైన విలువైన ఖనిజాలు రక్షణ రంగ పరికరాలు తయారీలో ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో అరుదైన ఖనిక్షేపాలు ఉన్నట్లు జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మధ్యకాలంలో గుర్తించిన విషయం తెలిసిందే. ఈ అరుదైన ఖనిజాలు ఉన్న గనులను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. తెలంగాణలోని వెనేడియం, టైటానియం, అల్యూమినియస్ లాటరైట్ వంటి విలువైన ఖనిజాల గనులను ఈ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా కు సమాచారం అందించింది. అయితే గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఖనిజాల గనుల వేలం పాటకు తమను ప్రాధాన్య బిడ్డరుగా ప్రకటించాలని స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఎన్ ఎల్ సి కంపెనీ వెల్లడించింది. సంగారెడ్డి జిల్లాలోని పర్వతాపూర్ వినేడియం టైటానియం అల్యూమినియం లాటరీ గనులకు తమ ప్రాధాన్య బిడ్డరుగా ప్రకటించారని సమాచారాన్ని అందించింది. జూన్ 11వ తేదీన ఈ వేలం పాటను నిర్వహించారు. అయితే జహీరాబాద్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే పర్వతాపూర్ ప్రాంతంలో ఈ అరుదైన వెనేడియం అల్యూమినియం లాటరైట్ టైటానియం ఖనిజాల
నిక్షేపాలు ఉన్నట్లు జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో గుర్తించారు. దీనిలో భాగంగా ఈ వేలం పాటను నిర్వహించారు .
జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం పర్వతాపూర్ బ్లాక్ లో 15.25 మిలియన్ టన్నుల మేర నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ బ్లాక్ మొత్తం విస్తీర్ణం సుమారు 335.51 హెక్టార్లుగా ఉంది.
అయితే ఈ వెనేడియం అనేది అత్యంత అరుదైన ఖనిజ సంపద అని చెప్పాలి. దీనిని స్టీల్ తయారీలో ఉపయోగిస్తుంటారు. ఉక్కు బలంగా అనిపించేందుకు బ్యాటరీల తయారీలో ఈ వినేడియంను ఎక్కువగా ఉపయోగిస్తారు. పర్వతాపూర్ బ్లాక్ లో 87 మిలియన్ టన్నుల మేర అల్యూమినస్ లాటరైట్ నిక్షేపాలు కూడా ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించారు.
ఈ ఖనిజాలను డిఫెన్స్ రంగంలో ఉపయోగిస్తుంటారు. ఎయిర్ క్రాఫ్ట్ తయారీలోనూ ఈ ఖనిజాలు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. మిలటరీ ఆయుధాలు, రాకెట్ల తయారీలోనూ ఈ ఖనిజాలు చాలా అవసరమని అభిప్రాయపడుతున్నారు.