
Today Horoscope June 14 Telugu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, అధిక జేష్ఠమాసం, గ్రీష్మ రుతువు, ఉత్తరాయణం, 2026 జూన్ 14వ తేదీ, ఆదివారం. ప్రముఖ పండితుల విశ్లేషణ ప్రకారం, ఈరోజు అదృష్టం కలిసివచ్చే రాశులు ఏవి? ఏ రాశి వారు కొత్త పనులు ప్రారంభించకూడదు? దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలా? అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. మేష రాశి: ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త బాధ్యతలను తీసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో సఖ్యతను పెంచుకోవడం శ్రేయస్కరం. వ్యాపార వృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయండి. అయితే, ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నందున ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మిథున రాశి: ఈరోజు కూడా మీకు మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో అందరితో కలిసిమెలిసి ఉండండి. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉన్నందున, కొత్త పనులకు శ్రీకారం చుట్టకండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. కర్కాటక రాశి: ఈరోజు మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల్లోనూ విజయం లభిస్తుంది, వ్యాపారాల్లో లాభాలు కూడా పొందుతారు. స్నేహితులు, బంధువులతో కలిసి సమయాన్ని గడుపుతారు. అనుకోని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. తుల రాశి: ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి అడుగు వేయాలి. మాట తీరుపై నియంత్రణ ఉండాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. కొత్త పనులు మొదలుపెట్టవద్దు. పెద్దల సలహాలు పాటించడం ఉత్తమం. ఇతరులతో అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. మకర రాశి: ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. కార్యాలయ పనుల్లో కూడా జాగ్రత్త వహించడం అవసరం. ఏదైనా గొడవల్లో చిక్కుకోకుండా చూసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ
నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)