రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘పెద్ది’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తాజాగా చిత్ర బృందంతో కలిసి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. బుచ్చిబాబుతో పాటుగా నిర్మాత వెంకట సతీష్ కిలారు, ఎడిటర్ నవీన్ నూలి పాల్గొన్నారు. తనయుడు చరణ్ తో పాటుగా ఇతర ప్రధాన నటులు, సాంకేతిక నిపుణులపై చిరు ప్రశంసలు కురిపించారు. 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ నటన చూసి చిరంజీవిని మించిపోయాడని అంటున్నారని, అందుకు ఒక తండ్రిగా గర్వపడుతున్నానని, ఒక యాక్టర్ గా మాత్రం కష్టంగా ఉందని చిరు అన్నారు. తన కుమారుడి నటన చూసిన తర్వాత పుత్రోత్సాహం కలిగిందని సంతోషం వ్యక్తం చేశారు. 'దంగల్' మూవీ కంటే 'పెద్ది'కి ఎక్కువ ఆదరణ ఉంటుందని చిరంజీవి అభిప్రాయపడ్డారు. 'చెక్ దే ఇండియా', 'దంగల్' లాంటి సినిమాలు తన దగ్గరకు వస్తే చేసేవాడిని.. తాను మిస్సయిన కథలను చరణ్ పొందినందుకు ఆనందంగా ఉందన్నారు.* కేరళలో ‘పెద్ది’ ఓపెనింగ్స్‌ను క్రాస్ చేసిన ‘హ్యాపీ’.. రీ-రిలీజ్‌తో అల్లు అర్జున్ సెన్సేషన్''ఒకసారి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాతో మాట్లాడుతూ.. 'నువ్వు ఒకప్పుడు ఆపద్భాందవుడు, రుద్రవీణ లాంటి సినిమాలు చేశావు. నీ నటన గురించి నాకు తెలుసు. కానీ ఎక్కువగా కమర్షియల్ వైపు వెళ్లిపోతున్నావు. నీలో ఆ పొటెన్షియాలిటీ ఉంది' అని అన్నారు. 'నీలో కమల్ హాసన్, రజనీకాంత్.. అందరి కలయిక ఉంది' అని బాలచందర్ నా గురించి అన్నమాటలను బాలు ప్రస్తావించారు. 'మనవాళ్లు అలాంటి కంటెంట్ తో వస్తే నేనెందుకు చేయను?. నాకు చేసే కెపాసిటీ ఉంది.. చేయగలననే నమ్మకముంది. అలాంటివి రావాలి కదా' అని అన్నాను. హిందీలో 'దంగల్', 'చెక్ దే ఇండియా' సినిమాలు వచ్చినప్పుడు.. వాటిల్లో వారి పెర్ఫార్మన్స్ చూసినప్పుడు, ఇలాంటి కథలు నాకు రావాలని కోరుకున్నాను. కానీ అలాంటి కంటెంట్ తో
దర్శకులు వస్తేనే కదా మనకి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు 'పెద్ది' సినిమా కూడా అలాంటి స్పోర్ట్స్ నేపథ్యంలోనే వచ్చింది''''దంగల్' సినిమాని తీసుకుంటే.. అది ఒక ఫ్యామిలీ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఆడబిడ్డల కుస్తీ, రెజ్లింగ్ కి సంబంధించిన ఫ్యామిలీ కథాంశంతో రూపొందించారు. వారి మధ్య ఇంటర్నల్ డ్రామా గుండెల్ని కట్టిపడేస్తుంది.. పిండేస్తుంది. 'పెద్ది' సినిమా విషయానికొస్తే.. ఇదొక రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా. అవగాహన కల్పిస్తూనే మోటివేట్ చేస్తుంది. ప్రభుత్వాలతో పాటుగా చిన్న పిల్లలు, తల్లిదండ్రులకు ఒక రకంగా ఇది ఎడ్యుకేటివ్ ఫిల్మ్. ప్రేక్షకులందరినీ ఆలోచింపజేసే సినిమా. అవి క్లాసిక్ స్పోర్ట్స్ డ్రామాలు అయినా.. 'పెద్ది' రస్టిక్ డ్రామా. గ్రామీణ నేపథ్యంలో తీసిన మట్టి మనుషుల కథ. అందుకనే దీనికి ఎక్కువ లాంగెవిటీ, ఎక్కువ ఆదరణ ఉంటుందనేది నా భావన. ఇలాంటి కథ చరణ్ కు వచ్చింది. నేను మిస్సయ్యింది.. చరణ్ పొందాడు. ఆ అవకాశం వచ్చింది కాబట్టే, 'చిరంజీవిని మించిపోయాడు' చరణ్ అంటున్నారు. దానికి నేనూ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఒక తండ్రిగా గర్వంగా ఉంది. కానీ ఒక నటుడిగా కొంచం కష్టంగా ఒప్పుకోవాల్సి వస్తోంది'' అని చిరంజీవి అన్నారు.