
యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్వర్యంలో విశాఖ బీచ్‌రోడ్డులోని ఈత కొలనులో యార్లగడ్డ గీతాశ్రీకాంత్ అనే 52 ఏళ్ల మహిళ గంటపాటు ప్లావనీ ప్రాణాయామం (నీటిపై తేలే ప్రక్రియ)...
యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఆధ్వర్యంలో విశాఖ బీచ్‌రోడ్డులోని ఈత కొలనులో యార్లగడ్డ గీతాశ్రీకాంత్ అనే 52 ఏళ్ల మహిళ గంటపాటు ప్లావనీ ప్రాణాయామం (నీటిపై తేలే ప్రక్రియ) ద్వారా యోగాసనాలు వేశారు. గతంలో ఈమెకు వెన్నెముక శస్త్రచికిత్సలు జరిగినా.. నీటిపై తేలుతూ చేతులు, నాభి, నుదుటిపై దీపాలను ఉంచుకుని పద్మాసనం, నైకాసనం, త్రికోణాసనం, సుఖాసనం వంటి 30 రకాల ఆసనాలను అవలీలగా వేసి ఆశ్చర్యపరిచారు. ఇటీవల నాందేడ్‌లో జరిగిన జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆమె జాతీయ అవార్డూ సాధించారు.
న్యూస్‌టుడే, విశాఖపట్నం (మధురవాడ, సాగర్‌నగర్)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.