
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత బ్యాటింగ్‌లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో యాంకర్ రోల్ పోషించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్‌తో తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు.
ఆఫ్గన్ బౌలర్లలో రషీద్‌ఖాన్, రెహమాన్ షరిఫీ చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. హస్మతుల్లా (26), భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు.
ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది. ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫొటోలు) పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్ (ఫొటోలు) ‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు) 'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు) పెద్ది టీంను అభినందించిన చిరంజీవి, బుచ్చి బాబుకు ప్రత్యేక అభినందనలు "రాత్రికి రాత్రే ఇళ్లన్నీ కూల్చేశారు..!
రాజమండ్రిలో పేదల కన్నీరు అసలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అడ్వకేట్ బాల షాకింగ్ కామెంట్స్!
Jun 13 2026 10:09 PM | Updated on Jun 13 2026 10:32 PM
అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
భారత బ్యాటింగ్‌లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో యాంకర్ రోల్ పోషించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్‌తో తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్‌ఖాన్, రెహమాన్ షరిఫీ చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.
ఆఫ్గన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. హస్మతుల్లా (26), భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది.
ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫొటోలు)
పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్ (ఫొటోలు)
‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
పెద్ది టీంను అభినందించిన చిరంజీవి, బుచ్చి బాబుకు ప్రత్యేక అభినందనలు
"రాత్రికి రాత్రే ఇళ్లన్నీ కూల్చేశారు..! రాజమండ్రిలో పేదల కన్నీరు
అసలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అడ్వకేట్ బాల షాకింగ్ కామెంట్స్!