
Star Heroine:ఒకప్పుడు తెలుగు, హిందీ చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన ఓ హీరోయిన్.. చాలా కాలం తర్వాత మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా అదే అందం, అదే చిరునవ్వుతో కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు గ్రేసీ సింగ్. బాలీవుడ్లో లగాన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గ్రేసీ సింగ్ ఇటీవల లగాన్ 25 ఏళ్ల సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆమె సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. చాలా కాలం తర్వాత పబ్లిక్ ఈవెంట్లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2001లో విడుదలైన లగాన్ సినిమాలో ఆమిర్ ఖాన్ సరసన గౌరి పాత్రలో నటించిన గ్రేసీ సింగ్ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారిపోయారు. ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్ పొందడంతో ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆ తర్వాత మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా గ్రేసీ సింగ్ బాగా సుపరిచితమే. నాగార్జున హీరోగా తెరకెక్కిన సంతోషం సినిమాలో కథానాయికగా నటించి మంచి గుర్తింపు సంపాదించారు. ఈ కుటుంబ కథా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించగా, గ్రేసీ నటనకు కూడా ప్రశంసలు దక్కాయి. అలాగే బాలకృష్ణ సరసన లక్ష్మీ నరసింహ సినిమాలో నటించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కొంతకాలం తర్వాత సినిమాలకు దూరమైన గ్రేసీ సింగ్ ఇప్పుడు అరుదుగా మాత్రమే పబ్లిక్ ఈవెంట్లలో కనిపిస్తున్నారు. అయినప్పటికీ ఆమెకు అభిమానుల్లో ఉన్న ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా లగాన్ 25వ వార్షికోత్సవ వేడుకలో ఆమె కనిపించడంతో పాత
Star Heroine:ఒకప్పుడు తెలుగు, హిందీ చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించిన ఓ హీరోయిన్.. చాలా కాలం తర్వాత మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా అదే అందం, అదే చిరునవ్వుతో కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు గ్రేసీ సింగ్. బాలీవుడ్లో లగాన్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గ్రేసీ సింగ్ ఇటీవల లగాన్ 25 ఏళ్ల సంబరాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఆమె సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. చాలా కాలం తర్వాత పబ్లిక్ ఈవెంట్లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2001లో విడుదలైన లగాన్ సినిమాలో ఆమిర్ ఖాన్ సరసన గౌరి పాత్రలో నటించిన గ్రేసీ సింగ్ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్గా మారిపోయారు. ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్ పొందడంతో ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఆ తర్వాత మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
తెలుగు ప్రేక్షకులకు కూడా గ్రేసీ సింగ్ బాగా సుపరిచితమే. నాగార్జున హీరోగా తెరకెక్కిన సంతోషం సినిమాలో కథానాయికగా నటించి మంచి గుర్తింపు సంపాదించారు. ఈ కుటుంబ కథా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించగా, గ్రేసీ నటనకు కూడా ప్రశంసలు దక్కాయి. అలాగే బాలకృష్ణ సరసన లక్ష్మీ నరసింహ సినిమాలో నటించి మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
A post shared by Instant Bollywood (@instantbollywood)
కొంతకాలం తర్వాత సినిమాలకు దూరమైన గ్రేసీ సింగ్ ఇప్పుడు అరుదుగా మాత్రమే పబ్లిక్ ఈవెంట్లలో కనిపిస్తున్నారు. అయినప్పటికీ ఆమెకు అభిమానుల్లో ఉన్న ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
తాజాగా లగాన్ 25వ వార్షికోత్సవ వేడుకలో ఆమె కనిపించడంతో పాత జ్ఞాపకాలు మరోసారి అభిమానుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇప్పటికీ అదే అందం, కాలం ఆమెపై ప్రభావం చూపలేదేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.