
సినిమా ఇండస్ట్రీలో గెలుపోటములు సహజం, కానీ ఈ మధ్యకాలంలో పరాజయాలు వస్తే చాలు నటీనటులపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) కూడా గత కొంతకాలంగా ఇలాంటి నెగెటివిటీని ఎదుర్కొంటోంది. వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన రిజల్ట్స్ రాకపోవడంతో కొంతమంది ఆమెను టార్గెట్ చేశారు. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘హై జవానీ ఇష్క్ హోనా హై’ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ఆమెను ‘ఐరన్ లెగ్’ అంటూ దారుణంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ విమర్శలపై సైలెంట్‌గా ఉన్న పూజా, తాజాగా వీటన్నింటికీ గట్టి కౌంటర్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఉండే క్రేజ్‌కు, థియేటర్లలో వచ్చే వసూళ్లకు అస్సలు ముడిపెట్టలేమని పూజా చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడింది. “నాకు ఇన్స్టాగ్రామ్, ఇతర వేదికలపై 30 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అంత మాత్రాన థియేటర్లలో 30 కోట్ల టికెట్లు తెగుతాయని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే” ఇలా తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది పూజాహెగ్డే. నెగెటివిటీని తాను అస్సలు పట్టించుకోనని, సోషల్ మీడియాలో కనిపించే అకౌంట్లలో చాలావరకు ఫేక్ అని అంటోంది పూజా పాప. ఇలాంటి ట్రోలింగ్స్ వల్ల తన కెరీర్ ఆగిపోదని కూడా క్లారిటీ ఇస్తోంది
.