
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య ఈ ఆదివారం (జూన్ 14న) శాంతి ఒప్పందం జరగే అవకాశం ఉందని పాకిస్థాన్ (Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. ఆ వెంటనే ఎలక్ట్రానిక్ సంతకాలు, సాంకేతిక స్థాయి చర్చలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, పాక్ ప్రధాని ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ స్పందించింది. ఆదివారం ఒప్పందంపై సంతకాలు జరగవని, ఇందుకు మరింత సమయం పడుతుందని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ మెమోరాండంపై రానున్న రోజుల్లో సంతకాలు చేసే అంశాన్ని తోసిపుచ్చలేమని ఇరాన్ (Iran) విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ పేర్కొన్నారు. అమెరికా అనుమానాల నేపథ్యంలో సంతకాలు చేసే కచ్చితమైన తేదీపై జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రంప్ బర్త్‌డే.. వైట్‌హౌస్‌లో ‘కేజ్ ఫైట్’.. రూ.500 కోట్ల ఖర్చు! గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.