
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Silver Price: భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా పడిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ.. వెండి ధరలు మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోయే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. ఆధునిక పరిశ్రమల వల్ల వెండికి డిమాండ్ వేగంగా పెరుగుతుంది. అదే సమయంలో వెండికి ఉన్న బలమైన డిమాండ్ దాని ధర మరింత పెరిగేందుకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం వెండి తన రికార్డ్ గరిష్ట స్థాయి కంటే 44 శాతం తక్కువ ధరకు ట్రేడ్ అవుతుంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం సద్దుమణిగింది. దీంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం నాడు ఎంసీఎక్స్ లో వెండి ధరలు కిలో రూ. 6000 పైగా అంటే 2.63 శాతం పెరిగింది. దీంతో కిలో వెండి ధర 2,50లక్షలకు చేరుకుంది. ఈ పెరుగుదల నేపథ్యంలో మార్కెట్ నిపుణులు ఒక ముఖ్యమైన సమాచారాన్ని పంచుకున్నారు. సరఫరా పరిమితులు, సౌరశక్తి, ఎలక్ట్రిక్ వాహనాల నుండి ఏఐ, డేటా సెంటర్ వరకు ఉన్న రంగాల నుండి పెరుగుతున్న డిమాండ్ కారణంగా దీర్ఘ కాలంలో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ వెండి ధర ఔన్స్ కు 64.50 నుంచి 65 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది. జనవరిలో గరిష్ట స్థాయి నుండి ధరలు తీవ్ర తగ్గుదల కనిపించినప్పటికీ ఈ మధ్యకాలంలో భారీ పెరుగుదల ఉంటుందని చాలామంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 2026 జనవరి చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా వెండి ధరలు ఔన్స్ కు ఒక 1 21.64 ఎంసీఎక్స్ లో కిలో రూ. 4. 20లక్షల వరకు రికార్డ్ స్థాయి చేరుకున్నాయి
. ఆ తర్వాత ఆ ధర భారీగా పడిపోతూ వచ్చింది. ఈ గరిష్ట స్థాయి నుంచి దాదాపు 44% ఈ తగ్గుదల వెనక అనేక కారణాలు ఉన్నాయి. సిఎంఈ గ్రూప్ విధించిన అధిక మార్జిన్ నిబంధనలు లేవరేడ్ ట్రడర్ల నుంచి తమ పొజిషన్ విక్రయించి నగదుగా మార్చుకునేలా ఒత్తిడి చేశాయి. అదే సమయంలో బలపడిన అమెరికన్ డాలర్ 2025 నాటికి వెండి ధర రూ. 147% పెరిగిన తర్వాత జరిగిన లాభాల స్వీకరణ ఈ తగ్గుదలను మరింత వేగం చేశాయని చెప్పాలి. అయితే ఈ అమ్మకాలు చాలావరకు సాంకేతిక కారణాల వల్ల జరిగాయని వెండి దీర్ఘకాలిక భవిష్యత్తుపై పెద్దగా ప్రభావం చూపలేదని విశేషకులు అంటున్నారు.
భారతదేశ ద్రవ్యోల్బణ గణాంకాలలో వెండికి ప్రాముఖ్యత పెరుగుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పాలి. ఎస్బిఐ రీసెర్చ్ వారి ఏకోవ్రాప్ రిపోర్టు ప్రకారం మే నెలలో ద్రవ్యోల్బణానికి వెండి ఆభరణాలు 56 బేసిస్ పాయింట్లు మేర దోహదపడ్డాయని చెప్పాలి. వ్యక్తిగత వస్తువుల్లో వెండి అత్యధికంగా దోహదపడిందని చెప్పుకోవాలి. బంగారం 30 బేసిక్ పాయింట్లు, పెట్రోల్ 14 బేసిన్స్ పాయింట్లు అందించాయి. ప్రపంచ వస్తువుల దోరణుల ప్రకారం బంగారం కంటే వెండి ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని కూడా ఆ రిపోర్ట్ పేర్కొంది. ధరల పెరుగుదల మే నెలలో వ్యక్తిగత సంరక్షణ విభాగంలో ద్రవ్యోల్బణం సుమారు 80 బేసిస్ పాయింట్లు పెరగడానికి దారితీసింది అని చెప్పాలి.
అయితే వెండి ధరలు భారీగా ఎందుకు పెరిగే అవకాశం ఉందన్న అంశాన్ని పరిశీలించినట్లయితే ఏఐ, సౌరశక్తి, ఎలక్ట్రానిక్ వాహనాలు ఈ 3 రంగాలే కారణమని చెప్పాలి. తద్వారా ఇది నూతన పారిశ్రామిక ఒక ఆశాజనకమైన లోహంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇది సోలార్ ప్యానెల్ లకు ఒక కీలకమైన ఆస్తిగా సిల్వర్ ఉంటుంది. భారతదేశం నిర్దేశించుకున్న పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు రానున్న దశాబ్దంలో బలమైన డిమాండ్‌కు మద్దతిస్తాయని అంచనా వేస్తున్నారు. విద్యుత్ వాహనాలు కూడా వృద్ధికి కీలక చోదకాలుగా మారానున్నాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం వాటిలో అధిక విద్యుత్ శక్తి ఉండటం వల్ల సాంప్రదాయ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే విద్యుత్ వాహనాలు దాదాపు రెండింతలు ఎక్కువగా వెండిని ఉపయోగిస్తాయి. ఏఐ కూడా డిమాండ్‌కు ఒక శక్తివంతమైన వనరుగా ఆవిర్భవిస్తుంది. వెండి అత్యంత విద్యుత్ వాహక లోకం ఏఐ డేటా సెంటర్లో ఉపయోగించే సర్వర్లు సెమీ కండక్టర్లు థర్మల్ మేనేజ్మెంట్ సిస్టంలో వెండి కీలకపాత్ర పోషిస్తుంది. ఈ మూడు కారణాల వల్లే భవిష్యత్తులో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.