
MK Stalin: తమిళనాడులో కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం, ముఖ్యమంత్రి విజయ్ తీరుపై డీఎంకే (DMK) అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కేంద్రంలోని బీజేపీకి ‘జిరాక్స్ కాపీ’లా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు అన్నాడీఎంకే (AIADMK) ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ కొనుగోలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. read also: Supriya Sule: కాంగ్రెస్లో విలీనంపై క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే చెన్నైలోని అన్నా అరివాలయంలో శనివారం నిర్వహించిన డీఎంకే మహిళా విభాగం సమావేశంలో ఎం.కె. స్టాలిన్ ప్రసంగించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి బీజేపీ ఎలాంటి అప్రజాస్వామిక వ్యూహాలను అమలు చేస్తోందో, ఇప్పుడు తమిళనాడులో సీఎం విజయ్ కూడా అదే బాటలో నడుస్తున్నారని విమర్శించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి అధికార పార్టీ ‘షాపింగ్’ కు తెరలేపిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసి కనీసం మూడు వారాలు (21 రోజులు) కూడా కాకముందే, ఓటర్ల వేలి సిరా గుర్తు కూడా చెరగకముందే నలుగురు అన్నాడీఎంకే శాసనసభ్యులు టీవీకే గూటికి చేరడాన్ని ఆయన ప్రస్తావించారు. వారికి ఎలాంటి ఆఫర్లు ఇచ్చి పార్టీలోకి లాక్కున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళా భద్రత పూర్తిగా క్షీణించిందని స్టాలిన్ ఆరోపించారు. ఇటీవల శ్రీవైకుంఠంలో జరిగిన ఒక లైంగిక వేధింపుల ఉదంతాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ ఘటనలో బాధితురాలితో పాటు నిందితులు కూడా అధికార టీవీకే పార్టీకి చెందినవారేనని స్పష్టం చేశారు. కనీసం నిందితులపై చర్యలు తీసుకోకపోగా, బాధితురాలినే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం దారుణమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీవీకే శ్రేణుల నుంచే మహిళలకు రక్షణ కల్పించాల్సిన దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. గతంలో టీవీకే ప్రభుత్వంపై తాను చేసిన వ్యాఖ్యలను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించారని
స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే తాను ఇప్పటివరకు వేచి చూశానని, అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే మౌనంగా ఉండలేకపోతున్నానని అన్నారు. అధికార పీఠాన్ని కూల్చడం తమ ఉద్దేశం కాదని, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై డీఎంకే ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో డీఎంకేను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి మహిళా కార్యకర్తలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Heavy Rain : భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Rahul : రాహుల్ వ్యూహాలు.. బీజేపీకి బలం చేకూరుస్తున్నాయి – మాజీ సీఎం పినరయి
Supriya Sule: కాంగ్రెస్లో విలీనంపై క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే
UP Crime: ప్రేమ పెళ్లి చేసుకుందని కన్న కూతురిపై కత్తితో దాడి.. యువతి మృతి
Lt General Dheeraj Seth: ఇండియన్ ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్
Four Maoists granted bail: విజయవాడలో అరెస్టైన నలుగురు మావోయిస్టులకు బెయిల్!