
ప్రపంచంలో ఈ సువాసనను ఇష్టపడని వారుండరు. అసలు ఈ సువాసన ఎందుకు వస్తుందో మీకు తెలుసా? దీని వెనుక ప్రకృతి దాచిన ఒక రహస్యం ఉంది. మొదటి వర్షం పడినప్పుడు వచ్చే ఈ ప్రత్యేకమైన సువాసనను సైన్స్ భాషలో 'పెట్రికోర్' (Petrichor) అని పిలుస్తారు.
గ్రీకు పదం నుండి వచ్చిన ఈ మాటకు 'రాళ్ల నుండి వచ్చే దైవిక రక్తం' అని అర్థం వస్తుంది. కేవలం నీటి వల్ల కాకుండా నేలలో జరిగే మార్పుల వల్లే ఇది సాధ్యమవుతుంది. వేసవి కాలంలో తీవ్రమైన ఎండల కారణంగా భూమి పూర్తిగా ఎండిపోతుంది. ఆ సమయంలో నేలపై ఉండే పొడి దుమ్ములో 'ఆక్టినోమైసెట్స్' (Actinomycetes) అనే ఒక ప్రత్యేక జాతికి చెందిన బ్యాక్టీరియా చేరుతుంది.
వాతావరణం తడిగా, నులివెచ్చగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతాయి. వర్షం పడినప్పుడు ఈ బ్యాక్టీరియా 'జియోస్మిన్' అనే ఒక సేంద్రీయ రసాయన సమ్మేళనాన్ని విడుదల చేస్తుంది. ఈ రసాయనమే మన ముక్కుకు అంతటి ఆహ్లాదకరమైన, మధురమైన మట్టి సువాసన వచ్చేలా చేస్తుంది.
ఇలా ప్రతి తొలి వాన వెనుక ప్రకృతి మరియు సైన్స్ కలయికతో కూడిన ఒక అద్భుతమైన ప్రక్రియ దాగి ఉంది. మరిన్ని వెబ్ స్టోరీస్ దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ ఏముంది మావా శోభా శెట్టి..
మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్ హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ