ధర్మశాలలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో అప్ఘానిస్థాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘాన్‌ను గుర్బాజ్ ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లు విఫలమైనా అతడు మాత్రం భారత బౌలర్లపై ఒంటరి పోరాటం చేస్తూ చెలరేగిపోయాడు. కేవలం 48 బంతుల్లోనే శతక్కొట్టి.. వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అప్ఘాన్ తరఫున ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ కొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు.అంతేకాకుండా వన్డేల్లో భారత్‌పై రెండో ఫాస్టెస్ట్ సెంచరీని కూడా గుర్బాజ్ నమోదు చేశాడు. గతంలో భారత్‌పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది 45 బంతుల్లో సెంచరీ చేశాడు. టీమిండియాపై వన్డేల్లో నమోదైన ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే. 48 బంతుల్లో సెంచరీ ద్వారా గుర్బాజ్.. జేమ్స్ ఫాల్క్‌నర్, ఏబీ డివిలియర్స్ (57 బంతులు) రికార్డులను అధిగమించాడు. అతడు ఈ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు. హష్మతుల్లా షాహిదీ (27), అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) మోస్తరు ప్రదర్శన చేశారు.ఇక టీమిండియా తరఫున డెబ్యూ బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే అదరగొట్టారు. చెరో మూడు వికెట్లు తీశారు. అర్షదీప్ సింగ్ 2, నితీశ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీశారు. దీంతో అప్ఘానిస్థాన్ పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించగా.. అప్ఘాన్ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా ముందు 195 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడిన అత్యధిక వయస్కుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ ప్లేయర్ మొహిందర్ అమర్నాథ్ పేరిట ఉంది
. ఆయన 39 ఏళ్ల 36 రోజుల వయసులో వన్డే ఆడారు. 39 ఏళ్ల 44 రోజుల వయస్సుతో హిట్‌మ్యాన్.. మొహిందర్‌ను అధిగమించాడు.