
డ్రగ్స్ ముఠా ట్రెన్ డి అరాగువా (Tren de Aragua)కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ ముఠా లీడర్ హెక్టర్ రుస్తెన్‌ఫోర్డ్ గెర్రెరో ఫ్లోరెస్ అలియాస్ నినో గెర్రెరో హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గ్యాంగ్‌పై అమెరికా కీలక ఆపరేషన్ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ట్రంప్ షేర్ చేశారు. ఈ వీడియోలో పచ్చటి పైకప్పు ఉన్న భవనం పేల్చివేయబడి.. ముక్కలు ముక్కలుగా అవ్వడం కనిపించింది. "ట్రెన్ డి అరాగువా ఉగ్రవాదులకు ఇకపై వెనిజులాలో కానీ.. మరెక్కడా కానీ సురక్షితమైన స్థావరం ఉండదు. నా నాయకత్వంలో ఈ ఘోరమైన హంతకులను, డ్రగ్ మాఫియా నాయకులను ఎప్పుడైనా, ఎక్కడైనా సరే వెతికి పట్టుకుంటాం. వారు ఉండాల్సిన నరకానికి వారిని పంపుతాం’’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్లో రాసుకొచ్చారు. ఈ ఆపరేషన్‌ను తాము ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్న వెనిజులాలోని తమ స్నేహితులతో కలిసి సమన్వయంతో చేపట్టినట్లు ట్రంప్ పేర్కొన్నారు. “నా ఆదేశాల మేరకు అమెరికా సదర్న్ కమాండ్ వేగవంతమైన, అత్యంత కచ్చితమైన దాడి నిర్వహించి ట్రెన్ డి అరాగువా నాయకుడు నినో గెర్రెరోను హతమార్చింది. ప్రపంచంలోని అత్యంత రక్తపిపాసి ఉగ్ర సంస్థల్లో ఇది ఒకటి” అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ముఠాను అమెరికా గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గెర్రెరో తలపై ఐదు మిలియన్ డాలర్ల రివార్డ్ కూడా ఉంది. అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు హింసాత్మక ఘటనల వెనుక ఈ ముఠా హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తోంది. పదేళ్ల క్రితం ఓ జైల్లో ఏర్పాటైన ట్రెన్ డి అరాగువా.. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో కన్నుసన్నల్లోనే ఈ గ్యాంగ్ పనిచేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫొటోలు) పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్ (ఫొటోలు) ‘రావు బహదూర్’ సినిమా
Jun 13 2026 7:30 PM | Updated on Jun 13 2026 8:32 PM
డ్రగ్స్ ముఠా ట్రెన్ డి అరాగువా (Tren de Aragua)కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ ముఠా లీడర్ హెక్టర్ రుస్తెన్‌ఫోర్డ్ గెర్రెరో ఫ్లోరెస్ అలియాస్ నినో గెర్రెరో హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గ్యాంగ్‌పై అమెరికా కీలక ఆపరేషన్ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ట్రంప్ షేర్ చేశారు. ఈ వీడియోలో పచ్చటి పైకప్పు ఉన్న భవనం పేల్చివేయబడి.. ముక్కలు ముక్కలుగా అవ్వడం కనిపించింది.
"ట్రెన్ డి అరాగువా ఉగ్రవాదులకు ఇకపై వెనిజులాలో కానీ.. మరెక్కడా కానీ సురక్షితమైన స్థావరం ఉండదు. నా నాయకత్వంలో ఈ ఘోరమైన హంతకులను, డ్రగ్ మాఫియా నాయకులను ఎప్పుడైనా, ఎక్కడైనా సరే వెతికి పట్టుకుంటాం. వారు ఉండాల్సిన నరకానికి వారిని పంపుతాం’’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్లో రాసుకొచ్చారు. ఈ ఆపరేషన్‌ను తాము ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్న వెనిజులాలోని తమ స్నేహితులతో కలిసి సమన్వయంతో చేపట్టినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
“నా ఆదేశాల మేరకు అమెరికా సదర్న్ కమాండ్ వేగవంతమైన, అత్యంత కచ్చితమైన దాడి నిర్వహించి ట్రెన్ డి అరాగువా నాయకుడు నినో గెర్రెరోను హతమార్చింది. ప్రపంచంలోని అత్యంత రక్తపిపాసి ఉగ్ర సంస్థల్లో ఇది ఒకటి” అంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ముఠాను అమెరికా గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
గెర్రెరో తలపై ఐదు మిలియన్ డాలర్ల రివార్డ్ కూడా ఉంది. అమెరికాలో డ్రగ్స్ అక్రమ రవాణాతో పాటు హింసాత్మక ఘటనల వెనుక ఈ ముఠా హస్తం ఉందని అమెరికా ఆరోపిస్తోంది. పదేళ్ల క్రితం ఓ జైల్లో ఏర్పాటైన ట్రెన్ డి అరాగువా.. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో కన్నుసన్నల్లోనే ఈ గ్యాంగ్ పనిచేస్తోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫొటోలు)
పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్ (ఫొటోలు)
‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
'ఓ..!సుకుమారి' టీజర్ విడుదల ఈవెంట్ (ఫొటోలు)
సముద్రంలో స్వర్గం.. దూరం కాదు, మన పక్కనే! (ఫొటోలు)
పెద్ది టీంను అభినందించిన చిరంజీవి, బుచ్చి బాబుకు ప్రత్యేక అభినందనలు
"రాత్రికి రాత్రే ఇళ్లన్నీ కూల్చేశారు..! రాజమండ్రిలో పేదల కన్నీరు
అసలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అడ్వకేట్ బాల షాకింగ్ కామెంట్స్!